MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్
ABN, Publish Date - Jan 04 , 2024 | 04:45 PM
Telangana: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గురువారం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేయడంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు (MLC Elections) షెడ్యూల్ విడుదలైంది. గురువారం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్‌ను విడుదల చేసింది. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేయడంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.
జనవరి 11 న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 18న నామినేషన్లకు చివరి రోజు. ఈనెల 22న నామినేషన్‌ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. జనవరి 29న ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నిక జరుగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం కౌంటింగ్.. ఫలితం వెలువడనుంది. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కాంగ్రెస్‌కు (Congress) ఒకటి, బీఆర్‌ఎస్‌కు(BRS) ఒకటి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 04 , 2024 | 04:45 PM