YS Sharmila: కోమటిరెడ్డి, హరీష్‌రావులను కలిసిన షర్మిల
ABN, Publish Date - Jan 11 , 2024 | 09:31 AM
కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. దీనికి షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. దీనికి షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల నేడు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. అలాగే మాజీ మంత్రి,సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుని సైతం షర్మిల ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడి వివాహానికి కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించాలని కోరారు.
Updated Date - Jan 11 , 2024 | 09:31 AM