Lasya Nandita: ఎమ్మెల్యే లాస్య కారులోనే అక్క కూతురు శ్లోక.. అయితే..
ABN, Publish Date - Feb 25 , 2024 | 11:04 AM
హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అతివేగంగా వచ్చిన లాస్య నందిత కారు ముందున్న టిప్పర్ లేదా రెడీమిక్స్ వాహనాన్ని ఢీ కొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సమయంలో ఆరు టిప్పర్ లారీలు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లినట్లు గుర్తించారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nandita) ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అతివేగంగా వచ్చిన లాస్య నందిత కారు ముందున్న టిప్పర్ లేదా రెడీమిక్స్ వాహనాన్ని ఢీ కొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సమయంలో ఆరు టిప్పర్ లారీలు ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road)పై వెళ్లినట్లు గుర్తించారు. కారు డ్రైవ్ చేసిన ఆకాష్ (Akash) రక్త నమూనాలను పోలీసులు సేకరించారు. మద్యం సేవించాడా? లేదా అనే దానిపై విచారణ చేస్తున్నారు. కాగా లాస్య కారులోనే ఆమె అక్క కూతురు శ్లోక ఉంది. అయితే ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు శ్లోకను లాస్య మరో కారులో ఎక్కించారు. దీంతో ఆమె ప్రమాదం నుండి తప్పించుకుంది. శ్లోక స్కూల్‌కు వెళ్లాల్సి ఉండడంతో మరో కారులో ఎక్కించి పంపించారు.
కాగా.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. ఘటనకు సంబంధించి పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను డాక్టర్లు రిలీజ్ చేశారు. ఈ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు.. అనుచరులు నివ్వెరపోతున్నారు. ఈ రేంజ్‌లో ప్రమాదం జరిగిందా..? అంటూ అనుచరులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి..
పోస్టుమార్టం రిపోర్టు ప్రాథమిక నివేదిక ప్రకారం.. ‘లాస్య తలకు బలమైన గాయాలు అయ్యాయి. తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. లాస్య ఆరు దంతాలు ఊడిపోయాయి. శరీరం లోపల ఎముకలు చాలా వరకు దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్‌లోనే చనిపోయింది. సీట్ బెల్ట్ పెట్టుకొకపోవడమే తీవ్ర గాయాలకు కారణం’ అని డాక్టర్లు వెల్లడించారు.
Updated Date - Feb 25 , 2024 | 11:23 AM