ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ktr: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి: కేటీఆర్

ABN, Publish Date - Oct 23 , 2024 | 05:18 PM

నాంపల్లి కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిగింది. అందులోభాగంగా కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆమె ఇలాంటి వాఖ్యలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సమాజంలో తనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని.. అయితే వాటిని దిగజార్చాలానే ఆమె ఈ తరహా వాఖ్యలు చేసిందని కోర్టుకు కేటీఆర్ విన్నవించారు.

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన పరువు, ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మాట్లాడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాంపల్లి కోర్టుకు తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి ప్రత్యేక కోర్టును ఈ సందర్బంగా కేటీఆర్ అభ్యర్థించారు. గత 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో తాను ఉన్నానన్నారు. అయితే ఆమె.. తన మాటలతో తానను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Bihar: పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్‌లో..


బుధవారం నాంపల్లి కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిగింది. అందులోభాగంగా కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఆమె ఇలాంటి వాఖ్యలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సమాజంలో తనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని.. అయితే వాటిని దిగజార్చాలానే ఆమె ఈ తరహా వాఖ్యలు చేసిందని కోర్టుకు కేటీఆర్ విన్నవించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పించినట్లు కోర్టుకు తెలిపారు. ఆ క్రమంలో యూట్యూబ్ లింక్స్‌తోపాటు పేపర్ స్టేట్‌మెంట్స్ ‌సైతం కోర్టుకు ఇచ్చానని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఆయన కోరారు.

Also Read: రేగు పండ్లు తింటే ఇన్ని లాభాలున్నాయా..?


కేటీఆర్ వ్యాఖ్యలపై కోర్టు స్పందించింది. మంత్రి కొండా సురేఖ ఏమి వాఖ్యలు చేసిందని కేటీఆర్‌ను ప్రశ్నించింది. దీంతో ఫిర్యాదు కాపీలో వివరాలన్నీ సమగ్రంగా ఉన్నాయని కోర్టుకు కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో వాటినే ప్రామాణికంగా తీసుకోవాలా? లేకుంటే స్టేట్మెంట్ ఇస్తారా? అని కోర్టు మళ్లీ ప్రశ్నించింది. ఆ వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయన్నారు. ఆ వివరాలు చెప్పమంటే చెప్తానని కోర్టుకు కేటీఆర్ తెలిపారు.


హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతా విడాకుల అంశంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్.. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.


ఇంతకీ కొండా సురేఖ ఏమందంటే..

నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. కేటీఆర్ వల్ల చాలా మంది హీరోయిన్లు.. త్వరగా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయారన్నారు. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో టాలీవుడ్ ప్రముఖులు సైతం స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.

ఇక టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున సైతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. మరోవైపు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ మీడియా ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.

For Telagana News And Telugu News

Updated Date - Oct 23 , 2024 | 07:28 PM