ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM: తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ..

ABN, Publish Date - Jul 30 , 2024 | 08:24 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మొట్ట మొదటిసారిగా దాదాపుగా 17 గంటల పాటు ఏక ధాటిగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సోమవారం ఉదయం10 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ వాడి వేడిగా జరిగి ముగిసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పాటు తరువాత మొట్ట మొదటిసారిగా దాదాపుగా 17 గంటల పాటు ఏక ధాటిగా అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings) జరిగాయి. సోమవారం ఉదయం10 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ వాడి వేడిగా జరిగి ముగిసింది. ఆయా సభ్యులు లెవనెత్తిన అంశాలపై సభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క (Finance Minister Bhatti Vikaramarka) వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు (BRS Leadrs) మా మధ్య తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని, చీప్ పబ్లిసిటీ చేసుకునే పరిస్థితిలో తామ లేమనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించాలన్నారు. స్వరాష్ట్ర తెలంగాణలో పవర్ ప్రాజెక్టులు భద్రాద్రి, యాదాద్రిలో మాత్రమే మొదలుపెట్టారని, భద్రాద్రి ప్రాజెక్టు నుంచి వచ్చింది ఒక వెయ్యి మెగా వాట్లు మాత్రమేనని అన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పవర్ ప్రొడక్షన్‌ను బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుందని, యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల ఏడాదికి రూ. వెయ్యి కోట్లు రవాణా భారం పడుతుందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 30 ఏళ్లకు.. 30 వేల కోట్ల రూపాయల భారం కేవలం రవాణాపైనే పడుతోందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం సరైన సదుపాయాలు ఉన్నాయా? లేదా? అని గత ప్రభుత్వం చూసుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పారిపాలన కాలంలో యాదాద్రి పవర్ ప్లాంట్ వద్దకు కేవలం రెండుసార్లు మాత్రమే ప్రభుత్వం వెళ్ళిందని, రూ. 30 వేల కోట్లకు పైచిలుకు ప్రాజెక్టుపై ఖర్చు చేసి అక్కడ అంశంపై రివ్యూ చేయరా? అని ప్రశ్నించారు.


అయితే నల్గొండ జిల్లాకు వద్ద అంటూ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. వద్దు అని తాము అనలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. జిల్లాలో ప్రాజెక్టు వచ్చినప్పుడు ఆ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందనేది కూడా చూసుకోవాలన్నారు. కాగా 1:100 గ్రూప్స్ అంశంలో అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈసారికి ఇప్పుడు జరుగుతున్న విధంగానే పరీక్షలు, నియమకాలు జరుగుతాయని తెలిపారు. వచ్చే దఫా నుంచి 1:100 అంశంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫొటోల పిచ్చి ఖరీదు రూ. 700 కోట్లు

పేదలకు డబుల్‌ బొనాంజా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 30 , 2024 | 08:24 AM

Advertising
Advertising
<