Telangana: ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్..!
ABN, Publish Date - Jan 13 , 2024 | 07:44 PM
న్యూఢిల్లీ, జనవరి 13: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఖరారు, ఖాళీగా ఉన్న మంత్రి పదవులపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ, జనవరి 13: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఖరారు, ఖాళీగా ఉన్న మంత్రి పదవులపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రి గానీ, ఆదివారం ఉదయం గానీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైనా పార్టీ అధినాయకత్వం ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఆశావహ నేతలు.. పార్టీ ప్రకటన కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దాంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెలసీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీ కార్యాలయం విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 18 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. 19వ తేదీన నామినేష్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 29వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నారు.
6 మంత్రి పదవులు..
తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాంతో మంత్రి దక్కించుకునేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీనియర్ల నుంచి జూనియర్ ఎమ్మెల్యేల వరకు మంత్రి పదవుల కోసం లాబాయింగ్ షురూ చేశారు. మరి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి.
Updated Date - Jan 13 , 2024 | 07:44 PM