ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ABN, Publish Date - Dec 22 , 2024 | 10:01 PM

సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా..

Allu Arjun

సినీ నటుడు అల్లు అర్జున్ నివాసానికి ఓయూ జేఏసీ పేరిట కొందరు విద్యార్థులు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి ఆదివారం సాయంత్రం కొందదరు వ్యక్తులు వెళ్లి రేవతి మృతికి సినీ నటుడు బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇంటి ప్రాంగణంలోని పూల కుండీలను పగలగొట్టడంతో పాటు, ఇంటిపైకి టమోటాలు, రాళ్లు విసిరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


అసలు ఏం జరిగింది

సంధ్య థియేటర్‌‌లో తోపులాట ఘటనకు, రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ ఓయూ జేఎసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటిముందు ఆందోళన నిర్వహించారు. ఇంటి లోపలకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. కొందరు దుండగులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. రేవతి చావుకు అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి తక్షణమే రూ.కోటి సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు

అల్లు అర్జున్ ఇంటివద్ద ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేశారు. జూబ్లిహిల్స్ పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. దాడిలో పాల్గొన్నది ఎవరనే విషయంపై ఆరా తీశారు. ఈ ఘటనపై అల్లు అరవింద్ సైతం స్పందించారు. ఇంటి వద్ద జరిగిన ఘటనను అందరూ చూశారని, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని అల్లు అరవింద్ తెలిపారు. ఇంటి దగ్గర ఎవరూ గొడవ చేసినా పోలీసులు వాళ్లను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు ప్రేరేపించకూడదని కోరారు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 22 , 2024 | 10:08 PM