ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics: అద్దంకి దయాకర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ABN, Publish Date - Jan 17 , 2024 | 04:56 PM

హైదరాబాద్, జనవరి 17: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఫైనల్ చేసింది. వీరిద్దరు పేర్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

Telangana MLC Elections

హైదరాబాద్, జనవరి 17: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఫైనల్ చేసింది. వీరిద్దరు పేర్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

అద్దంకి దయాకర్‌కు బిగ్ షాక్..

కాగా, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు బిగ్ షాక్ ఇచ్చింది ఆ పార్టీ అధిష్టానం. అద్దంకి మొండి చేయి చూపుతూ.. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్‌ పేర్లను విడుదల చేసింది. గురువారంతో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగియనుండగా.. బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. అయితే, నిన్నటి వరకు కూడా అద్దంకి దయాకర్‌కే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు అని ప్రచారం జరుగగా.. ఇవాళ సీన్ రివర్స్ అయ్యింది. అంతేకాదు.. మంగళవారం నాడు పార్టీ పెద్దలు సైతం అద్దంకి దయాకర్‌కు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారట. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. దయాకర్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఈ సంబరాలు, అనందం గంటల్లో ఆవిరయ్యాయి. కాంగ్రెస్ ప్రకటించిన లిస్ట్‌లో దయాకర్ పేరు మిస్ అయ్యి.. మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది.

29న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుండగా.. 29న రెండు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు.

Updated Date - Jan 17 , 2024 | 05:18 PM

Advertising
Advertising