ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Eid-al-Fitr: మానవీయ విలువలకు అద్దం పట్టే రంజాన్‌..

ABN, Publish Date - Apr 11 , 2024 | 07:35 AM

పవిత్ర రంజాన్‌(Ramadan) మాసం ముగింపు సందర్భంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను(Eid-al-Fitr) పురస్కరించుకుని ముస్లిం సమాజానికి గవర్నర్‌(Governor) సీపీ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఖురాన్‌ బోధనల ప్రభావం సమాజంపై ఎంతగానో ఉంటుందని, రంజాన్‌ మాసంలో చేపట్టిన ఉపవాస దీక్షలు స్వియ క్రమశిక్షణ, జీవితంపట్ల సానకూల..

Eid-al-Fitr

  • శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

  • లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీక: ముఖ్యమంత్రి రేవంత్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్‌(Ramadan) మాసం ముగింపు సందర్భంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను(Eid-al-Fitr) పురస్కరించుకుని ముస్లిం సమాజానికి గవర్నర్‌(Governor) సీపీ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఖురాన్‌ బోధనల ప్రభావం సమాజంపై ఎంతగానో ఉంటుందని, రంజాన్‌ మాసంలో చేపట్టిన ఉపవాస దీక్షలు స్వియ క్రమశిక్షణ, జీవితంపట్ల సానకూల దృక్పథాన్ని కలిగిస్తాయన్నారు. సహనం, పరోపకారం, త్యాగం వంటి మానవీయ విలువలు రంజాన్‌ మాసం పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

ముస్లింలకు సీఎం రేవంత్‌రెడ్డి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలను ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలు అందుకోవాలని ఆకాంక్షించారు. అన్ని సేవలకు మించి మానవసేవ అత్యున్నమైనదని చాటి చెప్పే రంజాన్‌... లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీక అన్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్‌, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కలిసిమెలిసి సుఖసంతోషాలతో జీవించేలా అల్లా ఆశీర్వదాలు ఉండాలని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు.

నేడు ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులపాటు జరిగిన రంజాన్‌ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణలు తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయన్నారు. తమ హయాంలో లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టామన్నారు. రాష్ట్రంలోని ముస్లిం కుటుంబాలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలందరూ అల్లా దీవెనలు అందుకోవాలని, ఈద్‌- ఉల్‌- ఫితర్‌ వేడుకల్లో ఆనందంగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 07:35 AM

Advertising
Advertising