Inter Exams: ఈనెల 28 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. స్టూడెంట్ ప్రెండ్లీగా ఏర్పాట్లు: శృతి ఓజా
ABN, Publish Date - Feb 26 , 2024 | 01:44 PM
Telangana: ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయని.. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ శృతి ఓజా తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 1521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 9, 80, 978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని చెప్పారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ (Telangana Inter Exams) జరుగుతాయని.. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ శృతి ఓజా తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 9, 80, 978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,78, 718 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 5,02, 260 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. పూర్తి స్థాయిలో స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఏర్పాట్లు జరిగాయాన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడి చదివారు... విద్యార్థులు మానసిక ఒత్తిడి తీసుకోకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని సూచించారు.
కలెక్టర్లు, ఎస్పీలతో పరీక్షల నిర్వహణపై రివ్యూ చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలు, కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వంద శాతం సిలబస్ పూర్తి చేశామన్నారు. ఒక్క నిమిషం నిబంధన అమలు కంటే అందరూ 9 గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని.. 9 తరువాత అనుమతి లేదని తెలిపారు. 475 మంది ఇంటర్ పరీక్షల గురించి టెలి మానస్‌కి కాల్స్ చేశారన్నారు. ఈసారి కూడా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్నామని శృతి ఓజా వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 26 , 2024 | 01:52 PM