TS Politics: బీఆర్ఎస్‌ను వీడనున్న తెల్లం వెంకట్రావు.. రంగంలోకి దిగిన హరీశ్ రావు?
ABN, Publish Date - Mar 04 , 2024 | 06:48 PM
ఖమ్మం, మహబూబ్‌బాద్ పార్లమెంట్ నియోజక వర్గ నేతలతో బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) నేడు(సోమవారం) సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఈ రెండు జిల్లాలోని కీలక నేతలంతా హాజరయ్యారు. కానీ కేసీఆర్ నిర్వహిస్తున్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkatarao) మాత్రం డుమ్మా కొట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే రాకపోవడం చర్చనీయాంశం అయింది.
భద్రాచలం: ఖమ్మం, మహబూబ్‌బాద్ పార్లమెంట్ నియోజక వర్గ నేతలతో బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) నేడు(సోమవారం) సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఈ రెండు జిల్లాలోని కీలక నేతలంతా హాజరయ్యారు. కానీ కేసీఆర్ నిర్వహిస్తున్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkatarao) మాత్రం డుమ్మా కొట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే రాకపోవడం చర్చనీయాంశం అయింది. గులాబీ పార్టీకి ఎమ్మెల్యే వెంకట్రావు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న(ఆదివారం) కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రరావు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆయన సత్సంబంధాలు చాలాకాలంగా కొనసాగిస్తున్నారు.
మంత్రి పొంగులేటి వెంకట్రావును కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో వెంకట్రావు చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే బీఆర్ఎస్‌లోకి వెంకట్రావు వెళ్లడం వెనుక కూడా పొంగులేటి హస్తమున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన పార్టీ వీడుతుండటంతో గులాబీ పెద్దలు అలెర్ట్ అయినట్లు సమాచారం. ఈ రోజు(సోమవారం) భద్రాచలం బీఆర్ఎస్ నేతలతో మాజీమంత్రి హరీష్ రావు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా వెంకట్రావు పార్టీ ఎందుకు మారుతున్నారనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. వెంకట్రావుతో పాటు ఇంకా ఎవరెవరు పార్టీ మారతారనే విషయంపై కూడా హరీశ్ రావు గోప్యంగా చర్చించినట్లు సమాచారం. ఆయనతో పాటు కీలక నేతలు ఎవరు కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా హరీశ్‌రావు ఎప్పటికప్పుడు ఆయా గులాబీ నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. తెల్లం వెంకట్రావు గనుక కాంగ్రెస్‌లోకి వెళ్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 04 , 2024 | 06:48 PM