TGPSC వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన..
ABN, Publish Date - Jul 05 , 2024 | 01:07 PM
హైదరాబాద్: టీజీపీఎస్సీ వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగడంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: టీజీపీఎస్సీ (TGPSC) వద్ద శుక్రవారం ఉద్రిక్తత (Tension)నెలకొంది. కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు (Unemployed JAC Leaders), ఇతర విద్యార్థి సంఘాల నాయకులు (Student Unions Leaders) యత్నించారు. దీంతో వారిని పోలీసులు (Police) అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగ నోటిఫికెషన్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
టీజీపీఎస్సీ శాంతియుత ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రధానంగా మూడు డిమాండ్లతో ముట్టడికి పిలుపునిచ్చింది. గ్రూప్ 2,3 పోస్టులు పెంచి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేసి, అక్టోబర్‌లో 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్ 1లో 1:100ను అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జగరకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులను ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్: హరీష్ రావు
కాగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (BRS Leader Harish Rao) తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? అని ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా అని నిలదీశారు. ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ... నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు రేవంత్ సర్కారు పాల్పడుతరోందని ఆరోపించారు.
ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదని ‘అప్రజాస్వామ్యపాలన’ అని ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు.. డిమాండ్లు సాధించే దాకా.. వదిలిపెట్టమన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతామని, నిర్వారామ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రత్యేకత చాటుకున్న ఎంపీ కలిశెట్టి
బాలుడికి అరుదైన వ్యాధి.. సహాయం కోసం ఎదురుచూపులు..
చిత్తూరు కార్పొరేషన్‌లో వైసీపీకి భారీ షాక్
జగన్ హయాంలో భారీగా ఇసుక దోపిడీ..
వైసీపీ నేతల బంధువులకే మార్కులు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 05 , 2024 | 01:10 PM