ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Group-1 Exams: గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

ABN, Publish Date - Oct 21 , 2024 | 08:24 AM

పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సిద్దంకాగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాపేపట్లో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈకేసును విచారించనుంది. ఈక్రమంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇస్తుందనే ఉత్కంఠ..

Group-1 Exam

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షలు ఇవాల్టి నుంచి ఈనెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఓవైపు పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సిద్దంకాగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాపేపట్లో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈకేసును విచారించనుంది. ఈక్రమంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేదానిపై ఓవైపు పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులతో పాటు.. వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జీవో29తో రిజర్వు అభ్యర్థులు నష్టపోతారని కొందరు గ్రూప్-1 అభ్యర్థులు చెబుతుండగా.. ఎవరికి ఎలాంటి నష్టం ఉండబోదని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. భారత సర్వోన్నత న్యాయస్థానం పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని చెబితే.. ఈరోజు నుంచి పరీక్షలు జరగనున్నాయి. లేదా ఏవైనా ప్రత్యేక ఆదేశాలు జారీచేస్తే.. టీజీపీఎస్సీ కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వివాదంపై మరికొద్దిగంటల్లో క్లారిటీ రానుంది.


పరీక్షల కోసం ఏర్పాట్లు..

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటుచేసింది. అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.


2011 తర్వాత..

2011 తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ టీవీలను పర్యవేక్షించనుంది. పరీక్షల నిర్వహణలో ప్రతి షిఫ్ట్‌లో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలను అధికారులు జారీచేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 21 , 2024 | 08:24 AM