ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Big Update: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతలో బిగ్ ట్విస్ట్...

ABN, Publish Date - Aug 24 , 2024 | 02:32 PM

N Convention Demolition: టాలీవుడ్ నటుడు నాగార్జుకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలను ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

N Convention Demolition

N Convention Demolition: టాలీవుడ్ నటుడు నాగార్జుకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలను ఆపేయాలని హైకోర్టు శనివారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గండిపేట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ కట్టాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిని పరిశీలించిన హైడ్రా.. శనివారం ఉదయాన్నే ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నేలమట్టం చేసింది.


అయితే, ఈ అంశంపై ఎన్ కన్వెన్షన్ సెంటర్ భాగస్వామ్య యజమాని అయిన అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పట్టా భూమిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించామని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేపట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 200 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి మరీ కూల్చివేశారన్నారు. 2014లో అప్పటి ఇరిగేషన్, జిహెచ్ఎంసి అధికారులు బిల్డింగ్‌ని కొలుస్తామని హెచ్చరించారని.. ఎఫ్‌టిఎల్‌‌లో బిల్డింగ్ ఉందని అప్పటి అధికారులు కూల్చేందుకు వచ్చారని గుర్తు చేశారు. అయితే, 2014లోనే హైకోర్టు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు. అప్పటికి ఇంకా ఎఫ్‌టి‌ఎల్‌ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు.


జస్టిస్ వినోద్ కుమార్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టగా.. కన్వెన్షన్ తరఫున సీనియర్ అడ్వకేట్ శ్రీరఘురాం వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. కూల్చివేతలు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటికే కన్వెన్షన్ సెంటర్‌ను పూర్తిగా నేలమట్టం చేసింది హైడ్రా. మరి దీనిపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు? హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.


Also Read:

తప్పని తేలితే.. మేమే కూల్చేస్తాం

నెక్స్ట్ ఫోకస్ దానిపైనేనా..!!

ఆ యువకుడి ధైర్యసాహసాలు హీరోని చేశాయి..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 24 , 2024 | 03:06 PM

Advertising
Advertising
<