ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raja Singh: ఎమ్మెల్యే రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్..

ABN, Publish Date - Jan 14 , 2024 | 01:25 PM

హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రామనవమి శోభాయాత్ర చేస్తే.. చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపులు వచ్చాయి. దీనిపై స్పందించిన రాజాసింగ్... ‘ఫోన్‌లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని’ సవాళ్లు విసిరారు.

హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రామనవమి శోభాయాత్ర చేస్తే.. చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపులు వచ్చాయి. దీనిపై స్పందించిన రాజాసింగ్... ‘ఫోన్‌లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని’ సవాళ్లు విసిరారు. 7199942827, 4223532270 నంబర్స్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయ్యోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రాజసింగ్‌కు తాజాగా బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ (అప్పటి డీజీపీ)కు లేఖ రాశారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో.. ఆ జాబితాను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. తనను చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా చెప్పారు.

Updated Date - Jan 14 , 2024 | 01:25 PM

Advertising
Advertising