Bhatti Vikramarka: గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి నివాళులు..
ABN, Publish Date - Jan 10 , 2024 | 11:14 AM
Telangana: తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. బుధవారం సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజాయుద్ధనౌక గద్దర్ సమాధి వద్దకు భట్టి చేరుకుని నివాళులర్పించారు.
హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) నివాళులర్పించారు. బుధవారం సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజాయుద్ధనౌక గద్దర్ సమాధి వద్దకు భట్టి చేరుకుని నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క తొలిసారిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
భట్టి విక్రమార్కను చూసి గద్దర్ భార్య గుమ్మడి విమల కంట తడి పెట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు. గద్దర్ భార్య విమలను డిప్యూటీ సీఎం ఓదార్చారు. గద్దర్ అన్న కుటుంబానికి తామంతా అండగా ఉంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా గద్దర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య విమల, కుమారుడు సూర్యం, కుమార్తె వెన్నెల.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం వెంట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 10 , 2024 | 11:21 AM