RTC MD Sajjanar: ఈసారి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించారట.. కారణమేంటో చెప్పిన ఆర్టీసీ ఎండీ
ABN, Publish Date - Jan 10 , 2024 | 04:12 PM
Telangana: సంక్రాంతి పండుగ కోసం 4484 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
హైదరాబాద్, జనవరి 10: సంక్రాంతి పండుగ కోసం 4484 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎంజీబీఎస్ నుంచి మాత్రమే కాకుండా ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. మహాలక్ష్మి స్కీం వల్ల ఈసారి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 10 , 2024 | 04:12 PM