ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress.. వింగ్స్ ఇండియా కార్యక్రమానికి ఆతిథ్యమివ్వడం సంతోషకరం: మంత్రి కోమటిరెడ్డి

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:13 PM

హైదరాబాద్: అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టు‌లో వింగ్స్ ఇండియా పేరుతో భారీ ప్రదర్శన ప్రారంభం కానుంది. కేంద్రపౌర విమానయాన శాఖ సహకారంతో..ఫిక్కి ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన చేపట్టబోతున్నారు.

హైదరాబాద్: అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. బేగంపేట్ ఎయిర్‌పోర్టు‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా ఎయిర్ షో’ పేరిట గురువారం భారీ ప్రదర్శన ప్రారంభం కానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో ఫిక్కి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను చేపట్టబోతున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు.

‘వింగ్స్ ఇండియా’ కార్యక్రమం ప్రారంభమవనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. వింగ్స్ ఇండియా కార్యక్రమానికి హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్ నుంచి యూఎస్ఏకు నేరుగా వారంలో మూడు సార్లు విమానం వేయాలని జ్యోతిరాదిత్య సింధియాను కోరామన్నారు. ఎయిర్ అంబులెన్స్‌లు ఎక్కువగా హైదరాబాద్‌కు వస్తున్నాయని, డ్రోన్ పైలెట్లకు ఎక్కువగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, అత్యవసరాలకు, శాంతిభద్రతల కోసం డ్రోన్లు వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానం ఉందని, ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా గురువారం నుంచి హైద్రాబాద్ మహానగరంలో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా ఎయిర్ షో’ మొదలుకానుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌కు దేశ విదేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్ 777-9 తో పాటు అనేక విమానాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈనెల 21వ తేదీ వరకు జరిగే ఈవెంట్‌లో దేశ విదేశాలకు చెందిన ఏరోప్లేన్స్ కనువిందు చేస్తాయి. ఈ ప్రదర్శనలో 106 దేశాల నుంచి సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Updated Date - Jan 18 , 2024 | 12:23 PM

Advertising
Advertising