ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకండి..

ABN, Publish Date - Nov 27 , 2024 | 03:59 PM

మాదాపూర్ ఈదులకుంట చెరువుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖానామెట్ విలేజ్ లో 6.5 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈదులకుంట చెరువు శిఖాన్ని పూడ్చివేసి కొంతమంది బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు.

Hydra Commissioner Ranganath

హైదరాబాద్ : మాదాపూర్ ఈదులకుంట చెరువుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖానామెట్ విలేజ్ లో 6.5 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈదులకుంట చెరువు శిఖాన్ని పూడ్చివేసి కొంతమంది బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు. చెరువులోకి వర్షం నీటిని మోసుకువచ్చే నాలాను దారి మళ్లించి బిల్డర్లు కబ్జా చేసినట్లు తెలుసుకున్నారు.

అక్రమ అనుమతులతో..

పక్కన ఉన్న పట్ట భూమి సర్వే నెంబర్ తో డాక్యుమెంట్ సృష్టించి చెరువులో అనుమతులు తీసుకున్నారని.. అక్రమ అనుమతులతో బిల్డర్లు చెరువులో నిర్మాణాలు చేపట్టారని హైడ్రా కమిషనర్ గుర్తించారు. కూకట్పల్లి శేరిలింగంపల్లి రెవెన్యూ సరిహద్దుల్లో ఉన్న ఈదుల కుంటను సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు.


తెలంగాణలో ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట హైడ్రా (HYDRA)ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తోంది. భారీ యంత్రాలతో అక్రమంగా నిర్మాణించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది నేల మట్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19వ తేదీన తెలంగాణ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేస్తూ జీవో 99ను తీసుకువచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే మూడున్నర నెలల వ్యవధిలో దాదాపు 300కు పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది.

Updated Date - Nov 27 , 2024 | 04:12 PM