ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Warangal : కొండా 7 రేవూరి

ABN, Publish Date - Oct 14 , 2024 | 04:19 AM

వరంగల్‌ జిల్లా కాంగ్రె్‌సలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం.. మంత్రి సురేఖ స్వయంగా పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్లింది.

  • కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఽధర్మారంలో ఫ్లెక్సీ వివాదం

  • ఎమ్మెల్యే ఫొటో లేదని రగడ.. మంత్రి, ప్రకాశ్‌రెడ్డి వర్గాల ఘర్షణ

  • పోలీసులపై సురేఖ ఆగ్రహం.. సీఐ కుర్చీలో కూర్చోవడంపై వివాదం

  • కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. ధర్మారంలో ఫ్లెక్సీ వివాదం

గీసుగొండ, అక్టోబరు 13: వరంగల్‌ జిల్లా కాంగ్రె్‌సలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం.. మంత్రి సురేఖ స్వయంగా పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్లింది. దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరకాల నియోజకవర్గంలోని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమైంది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేకపోవడంతో కొండా వర్గీయులతో రేవూరి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. మరుసటి రోజు ఆ ఫ్లెక్సీ చినిగి ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే రేవూరి వర్గానికి చెందిన

వ్యక్తి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టారని ఆరోపిస్తూ కొండా వర్గీయులు ఆదివారం ధర్మారం వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ పెద్దసంఖ్యలో అనుచరులతో కలిసి పోలీ్‌సస్టేషన్‌కు ఆటోలో వచ్చారు. నేరుగా తమవారి వద్దకు వెళ్లి మాట్లాడారు. పోలీసులు తమను కొట్టారని వారు మంత్రికి చెప్పటంతో డీసీపీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ నుంచే వరంగల్‌ నగర పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝాకు ఫోన్‌ చేసి ఎస్‌ఐ, సీఐ, డీసీపీలను రిలీవ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కొద్దిసేపటికి స్టేషన్‌కు చేరుకున్న సీపీ.. మంత్రి వర్గీయులతో ఆమె ముందే మాట్లాడారు. దీంతో శాంతించిన మంత్రి స్టేషన్‌ నుంచి బయటికి వెళ్లిపోయారు. అయితే పోలీ్‌సస్టేషన్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ కుర్చీలో కూర్చోవడం కొత్త వివాదానికి దారితీసింది. ప్రొటోకాల్‌ నిబంధనల్ని మంత్రి ఉల్లంఘించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Oct 14 , 2024 | 04:19 AM