ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: ‘హైడ్రా’కు పెరుగుతున్న ఎమ్మెల్యేల మద్దతు..

ABN, Publish Date - Aug 26 , 2024 | 01:53 PM

హైడ్రాకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అటు పొలిటికల్‌గా.. ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాకు కావల్సినంత మద్దతును కూడగట్టింది...

హైదరాబాద్: హైడ్రాకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అటు పొలిటికల్‌గా.. ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాకు కావల్సినంత మద్దతును కూడగట్టింది. అన్ని వర్గాల ప్రజలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాపై సొంత పార్టీలో ఇబ్బందులు వస్తాయని తొలుత సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ ఎమ్మెల్యేలంతా రేవంత్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తారించాలని రేవంత్‌కి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రాపై అభినందనలు తెలుపుతూ రేవంత్‌కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్‌లు లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం సీఏం రేవంత్‌కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాశారు.


వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎఫ్‌టీఎల్ పరిధిలో గెస్ట్ హౌజ్ కట్టాడని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. హైడ్రాను తమ నియోజకవర్గంలో కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రిక్వెస్ట్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో కూడా ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని వేముల వీరేశం లేఖ రాశారు. ఆలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములు, అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎంకి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లేఖ రాశారు. తమ నియోజకవర్గంలో హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకు రావాలని మానుకొండూర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే కాలే యాదయ్య, తదితరులు రేవంత్‌కి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జ్ఞాన సుందర్ నేడు గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హైట్ కొలవగలరేమో కానీ ఆయన ఆత్మవిశ్వాసాన్ని కొలవలేరని కొనియాడారు.


పేదవాడిని కొట్టడం తప్పా, పెద్ద వాళ్ళకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎవరికీ భయపడకుండా ముందుకి పోతోందన్నారు. హైడ్రాకి ప్రజల మద్దతు ఉందన్నారు. తెలంగాణ అంతటా హైడ్రా లాంటి వ్యవస్థను విస్తరించాలని కోరారు. రేవంత్ ఆలోచనకి ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతోందన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు విన్నారని.. అందుకే ఫేక్ పట్టాలు పొందగలిగారని జ్ఞాన సుందర్ పేర్కొన్నారు. అయితే నగరంలో హైడ్రా మాత్రం నాన్ స్టాప్‌గా కూల్చివేతలు నిర్వహిస్తోంది. శేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. రాయదుర్గం సర్వేనెంబర్ 72లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీగా పోలీసుల మోహరించారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు.

Updated Date - Aug 26 , 2024 | 01:59 PM

Advertising
Advertising
<