ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IMD: హైదరాబాద్ సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్..

ABN, Publish Date - Sep 02 , 2024 | 07:43 AM

వర్ష బీభత్సంతో అల్లాడుతున్న తెలంగాణ పల్లెలు, పట్టణాలు, నగరాలకు మరోసారి భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌తోపాటు 6 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్: వర్ష బీభత్సంతో అల్లాడుతున్న తెలంగాణ పల్లెలు, పట్టణాలు, నగరాలకు మరోసారి భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌తోపాటు 6 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో రెండు రోజులు నిరంతర భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో, సోమవారం నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. . కామారెడ్డి, నిజామాబాద్‌, రాజన్నసిరిసిల్ల, నిర్మల్‌, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేటజిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఇక, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాలలో, రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. "నగరంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదా బలమైన ఈదురు గాలులతో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 24°C, 22°C మేర నమోదవుతాయి" అని ఐఎండీ తన ప్రకటనలో పేర్కొంది.


ఆదివారమంతా కుంభవృష్టే..

రాష్ట్రంలో ఆదివారమంతా కుంభవృష్టి కురిసింది. వరుణిడి దెబ్బకు రాష్ట్రమంతా తడిసి ముద్దైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో రోజంతా వాన పడుతూనే ఉంది. పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి, చిన్నగూడురు మండలాల్లో ఆదివారం అత్యధికంగా 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని నర్సింహులుపేట మండలంలో 40.5 సెం.మీల వర్షం కురిసింది. మొత్తంగా రాష్ట్రంలోని 16 మండలాల్లో 30 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదైంది.

For Latest News click here

Updated Date - Sep 02 , 2024 | 07:43 AM

Advertising
Advertising