ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీసా లేకుండానే ఇక రష్యాకు

ABN, Publish Date - Dec 16 , 2024 | 05:43 AM

భారతీయులు ఇక వీసా అవసరం లేకుండానే రష్యాలో పర్యటించవచ్చు. రానున్న వసంత రుతువు నుంచే ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రష్యాలో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ‘వీసా ఫ్రీ’ సౌకరాన్ని కలిగించనుంది.

  • త్వరలోనే అమల్లోకి నూతన విధానం

న్యూఢిల్లీ, డిసెంబరు 15: భారతీయులు ఇక వీసా అవసరం లేకుండానే రష్యాలో పర్యటించవచ్చు. రానున్న వసంత రుతువు నుంచే ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రష్యాలో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ‘వీసా ఫ్రీ’ సౌకరాన్ని కలిగించనుంది. బృందాలుగా వచ్చే భారతీయుల విషయంలో వీసా నిబంధనలను సడలించాలని జూన్‌ నెలలో భారత్‌-రష్యాలు ఒక అంగీకారానికి వచ్చాయి. రష్యాలో పర్యటించాలంటే ఏ పని మీద వచ్చారన్నదాన్ని గమనించి వీసా మంజూరు చేస్తారు. టూరిస్టు, బిజినెస్‌, మానవీయ కారణాలు, ప్రయివేటు, ఉద్యోగం, విద్యార్థి... ఇలా పలు రకాల వీసాలు ఉంటాయి. ఇది మంజూరుకు చాలా సమయం పడుతుంది. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి భారతీయ పర్యాటకులకు ఏకీకృత ఈ-వీసా (యూనిఫైడ్‌ ఈ-వీసా...యూఈవీ)ని అమలు చేస్తున్నారు.


వచ్చే పని ఏదన్నదానితో సంబంధం లేకుండా యూఈవీ ఉంటే అన్నింటికీ చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు సరళీకరించారు. ఈ సౌకర్యాన్ని 55 దేశాలకు వర్తింపజేసింది. ఆ జాబితాలో ప్రస్తుతం భారత్‌ కూడా చేరింది. చైనా, ఇరాన్‌ దేశాల పౌరులకు వీసా-ఫ్రీ విధానాన్ని అమలు చేస్తుండగా ఇకపై భారత్‌కు కూడా అదే సౌకర్యం కలగనుంది. యూఈవీల కోసం రష్యా రాయబార, కాన్సులేట్‌ కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాలు రిజిస్ట్రేషన్‌ సిస్టంతో ఉన్న సమాచారంతో సరిపోయినప్పుడే మాత్రమే వీసాలు మంజూరు చేస్తుంది. దీన్ని మంజూరు చేసేందుకు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. యూఈవీ ఉంటే రష్యాలో ఏ పనిమీదయినా పర్యటించడానికి వీలు కలుగుతుంది.

Updated Date - Dec 16 , 2024 | 05:43 AM