ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pushpa‌ 2: పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Dec 03 , 2024 | 02:09 PM

పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షో లకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యులు మూవీ చూసే పరిస్థితి లేదని పిటిషనర్ పేర్కొన్నారు.

Pushpa‌ 2

Pushpa‌ 2: టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షో లకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యులు మూవీ చూసే పరిస్థితి లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ డేస్ లో రిలీజ్ రోజే సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయన్న న్యాయమూర్తి..ఇప్పట్లో కుటుంబం మొత్తం సినిమా వీక్షించాలంటే 8 వేలు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


జీవోలు పరిశీలిస్తాం..

పుష్ప 2 బెనిఫిట్ షో ద్వారా వచ్చే నగదు ఎక్కడికి మల్లిస్తున్నారని పిటిషనర్ ప్రశ్నించారు. అయితే, పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది. జీవోలను సైతం పరిశీలిస్తామని పేర్కొంది. రాత్రి 10 గంటలకు షో వేస్తే మధ్య రాత్రి 1 అవుతుందని పిల్లలకు నిద్ర అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.


కాగా, పుష్ప-2 సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో టిక్కెట్ ధరపై రూ. 800 వరకు పెంచింది. డిసెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు రూ. 200, ఆ తర్వాత కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే, ఈ సినిమా టిక్కెట్ రేట్లను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడిగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడుగా ఉన్నారు. డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - Dec 03 , 2024 | 03:14 PM