Telangana: హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు
ABN, Publish Date - May 29 , 2024 | 05:15 AM
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, భద్రాచలంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార తనిఖీ శాఖ అధికారులు ఆది, సోమవారాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆదివారం ఖమ్మంలోని 3 ప్రముఖ రెస్టారెంట్లలో రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ జ్యోతిర్మయి, నల్లగొండ, వనపర్తి ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు స్వాతి, నీలిమ టాస్క్‌ఫోర్స్ బృందంగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.
ఖమ్మం, భద్రాచలంలో బూజు పట్టిన ఐస్‌క్రీమ్, ఈగలు పడిన ఇడ్లీ పిండి పట్టివేత
చికెన్ వింగ్స్, కొబ్బరి పొడి, బాదం పప్పు నమూనాల సేకరణ.. జరిమానా విధింపు
ఖమ్మం సంక్షేమ విభాగం, మే 28: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, భద్రాచలంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార తనిఖీ శాఖ అధికారులు ఆది, సోమవారాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆదివారం ఖమ్మంలోని 3 ప్రముఖ రెస్టారెంట్లలో రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ జ్యోతిర్మయి, నల్లగొండ, వనపర్తి ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు స్వాతి, నీలిమ టాస్క్‌ఫోర్స్ బృందంగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని రెస్టారెంట్లలో వంటశాలలు, ఫ్రిజ్‌లను పరిశీలించి మాంసం నిల్వలు ఉన్నాయా?అని తనిఖీ చేశారు.ఉప్పు, పసుపు, కారం నుంచి దినుసుల వరకు క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. అయితే ఆయా హోటళ్లలో ఎలాంటి లోపా లు బయట పడలేదు.
రెస్ట్‌ఇన్ హోటల్‌లో కొబ్బరి పొడి నమూనాలు, శ్రీశ్రీలో బాదం పప్పు, హవేలి వెస్ట్‌జోన్‌లో చికెన్ వింగ్స్ నమూనాలు సేకరించారు. భద్రాచలంలో శ్రీ భద్ర గ్రాండ్ హోటల్, శ్రీ గౌతమి స్పైస్ హాల్, శ్రీ రాఘవేంద్ర టిఫెన్ అండ్ మీల్స్ హోటల్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ భద్ర హోటల్‌లో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన 88 లీటర్ల ఐస్‌క్రీం బూజు పట్టి, పురుగులతో దుర్వాసన రావడంతో ధ్వంసం చేశారు. అలాగే ఫెస్సా చట్టానికి విరుద్ధంగా హానికరమైన రంగులు కలిపి ఆహార పదార్థాలను తయారుచేస్తుండటంతో నోటీసులు జారీ చేశారు.
ఈ హోటల్‌లో 10 కేజీల రంగు కలిపిన బిర్యానీని ధ్వంసం చేసి రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే గౌతమ్ స్పైసె్‌సలో దుమ్ము, ధూళి, ఈగలు, పురుగులతో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారుచేస్తుండటాన్ని గుర్తించారు. ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడాన్ని గమనించి వాటన్నిటినీ ధ్వంసం చేసి ఫెస్సా చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి రూ.25 వేల జరిమానా విధించారు. అనంతరం రాఘవేంద్ర టిఫిన్స్ అండ్ మీల్స్ హోటల్‌లో పాలు, ఇడ్లీ పిండిలో చచ్చిపోయిన ఈగలు, వండిన కూరల్లో బిల్డింగ్ పైకప్పు నుంచి బూజు, మట్టి పడి ఉండటాన్ని గుర్తించారు. దాంతో హోటల్ నిర్వాహకులకు రూ.5 వేల జరిమానా విధించారు.
కల్తీ పాల వ్యాపారి అరెస్టు
భూదాన్‌పోచంపల్లి: కల్తీ పాలు తయారుచేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం(ఎ్‌సవోటీ) మంగళవారం అరెస్టు చేసిం ది. భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పరిధిలోని ముక్తాపూర్ గ్రామానికి చెందిన సన్న ప్రశాంత్(23) నాలుగేళ్లుగా పరిసర గ్రామాల రైతుల నుంచి ప్రతి రోజు 100 లీటర్ల మేర పాలు కొనుగోలు చేసి, మరో 50 లీటర్ల పాల కోసం వివిధ కంపెనీల పాల పొడి, హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని వినియోగిస్తున్నాడు.
ప్రశాంత్ మంగళవారం ఉదయం కల్తీ పాలను తయారు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 60 లీటర్ల కల్తీ పాలు, 250మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం, పాల పొడి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - May 29 , 2024 | 05:15 AM