ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఎక్సైజ్ శాఖలో పీసీబీ ఫైల్స్ దహనం ఘటనపై ఆసక్తికర చర్చ

ABN, Publish Date - Jul 05 , 2024 | 11:40 AM

ఏపీలో సంచలనం సృష్టించిన పీసీబీ ఫైల్స్ దహనం ఘటన ఎక్సైజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉండడంతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

అమరావతి: ఏపీలో సంచలనం సృష్టించిన పీసీబీ ఫైల్స్ దహనం ఘటన ఎక్సైజ్ శాఖ (Excise Department)లో చర్చనీయాంశంగా మారింది. కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉండడంతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. రామారావు ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు పని చేశారు. ఈ క్రమంలోనే రామారావు గురించి పలు ఆసక్తికర వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త ప్రభుత్వంలోని ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తానంటూ గత కొంత కాలంగా రామారావు ప్రచారం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పీసీబీపై రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ (Pawan Kalyan)తో తానున్న ఫొటోను తన సన్నిహితుల గ్రూపుల్లో రామారావు పెట్టారు.


పవన్ సహా ఇంకొందరు మంత్రులకు తాను సన్నిహితుడినని ప్రచారం చేసుకుంటున్నారని ఎక్సైజ్ శాఖలో చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యుల తెర వెనుక వ్యవహారాలను చక్కబెట్టడంలో రామారావు దిట్ట అని అంతా మాట్లాడుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు.. ఆర్వోఆర్ విషయాల్లో భారీ అక్రమాలకు తెర తీశారని రామారావుపై అభియోగాలు వస్తున్నాయి. 2014-19 మధ్య కాలంలో రామారావు అక్రమాలపై నాటి సీఎం చంద్రబాబుకు అప్పటి మంత్రి జవహర్ ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇప్పుడు ఫైళ్ల దగ్దం ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి...

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

BRS: బీఆర్ఎస్ నుంచి మరో కీలక వికెట్ ఔట్..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 11:40 AM

Advertising
Advertising