ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మత్తులో ముంచేసి...

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:34 AM

మందుబాబులు మోసానికి గురవుతున్నారు. మద్యం మత్తులో ఉండటాన్ని ఆసరా చేసుకొని జిల్లాలోని కొన్ని బార్‌ అండ్‌ రెస్టా రెంట్ల నిర్వాహకులు నాసిరకం ఆహార పదార్థాలు అంటగడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

నిబంధనలు పాటించని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు

జోరుగా నాణ్యతలేని ఆహార పదార్థాల విక్రయాలు

కనీస ప్రమాణాలు పాటించని నిర్వాహకులు

పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు

భూపాలపల్లి కృష్ణకాలనీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యో తి): మందుబాబులు మోసానికి గురవుతున్నారు. మద్యం మత్తులో ఉండటాన్ని ఆసరా చేసుకొని జిల్లాలోని కొన్ని బార్‌ అండ్‌ రెస్టా రెంట్ల నిర్వాహకులు నాసిరకం ఆహార పదార్థాలు అంటగడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పర్య వేక్షించే వారు, పట్టించుకొనే వారు కరువు కావడంతో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. మరో వైపు బార్‌ షాపుల నిర్వహణలో సమయపాలనను పాటించడదం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెల్లారే దాకా నడిపిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని తెలుస్తోంది. దీంతో మందు బాబుల మఽధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

ధర ఎక్కువ.. నాణ్యత తక్కువ

జిల్లా కేంద్రం కావడంతో భూపాలపల్లికి గతం కం టే రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్ల వ్యాపారం జోరందుకుంది. నిత్యం అవి మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. మద్యం సేవిస్తున్న సమయంలో ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకోవడం పరిపాటి. అయితే.. వారికి బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు కలిషిత, నాణ్యత లేని ఆహా రాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పైౖకి హంగూ ఆర్బాటం కనిపిస్తున్నా.. వండేది మాత్రం పూర్తిగా కల్తీనేననే తెలుస్తోంది. రెండు మూడు రో జుల పాటు నిల్వ చేసిన ఆహారాన్ని అమ్ముతున్నారని సమాచారం. ఇటీవల ఓ రెస్టారెంట్‌లో మందుబా బు లకు, నిర్వాహకుల మధ్య ఆహారం విషయంలో వా గ్వావాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ధరల విష యంలో చూపించే శ్రద్ధ నాణ్యతలో చూపడం లేదని పలువురు మందుబాబులు మండిపడుతున్నారు.

నిబంధనలు బేఖాతర్‌

బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో వండే ఆహారంలో సరు కులకు ఏరోజుకారోజు వినియోగించాల్సి ఉంది. వాడి న నూనె మళ్లీ వాడొద్దు. భోజనం తయారు చేసే ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. వినియోగదారులు మిగిల్చిన ఆహారాన్ని వెంటనే పడేయాలి. ఆహార పదార్థాలు, మాంసం మిగిలితే వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. అలాగే బార్‌ అండ్‌ రెస్టారెంట్లను ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటలకు తెరచి ఉంచాలి. సమయం దాటాక మందు విక్రయాలు జరపొద్దనే నిబంధనలు ఉన్నాయి. అయినా అవేమీ అమలు కావడం లేదని తెలుస్తోంది.

పర్యవేక్షణ శూన్యం!

భూపాలపల్లి జిల్లాలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నిఘా ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టానుసా రంగా విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూ డా బార్ల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. నిర్వా హకులకు కొందరు అధికారులే వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 24 , 2024 | 12:34 AM