ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన?

ABN, Publish Date - Aug 14 , 2024 | 11:05 AM

కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని ట్విటర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓ వైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందన్నారు. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు.

MLA KTR

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని ట్విటర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓ వైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందన్నారు. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా తయారైందని కేటీఆర్ అన్నారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయన్నారు.


పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన అంటే అని కేటీఆర్ నిలదీశారు. నాడు.. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెలా పంచాయితీలకు ఠంచన్ గా రూ.275 కోట్లు విడుదల చేశామన్నారు. నేడు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మంది మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు.. అక్రమ అరెస్టులు చేయిస్తున్నారన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని కేటీఆర్ నిలదీశారు. ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారని ప్రశ్నించారు. 12,769 పంచాయితీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే రూ.4305 కోట్లని అంచనా అని పేర్కొన్నారు. వాటి పరిస్థితి ఏంటని కేటీఆర్ నిలదీశారు.


దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యమని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో.. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేస్తే.. ఇక పట్టణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. గ్రేటర్‌తోపాటు.. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో జీహెచ్ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో.. మహానగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట వాస్తవం కాదా అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ చెప్పుకునే ప్రజాపాలనలో.. పల్లె ప్రగతికి పాతరేసి.. పట్టణ ప్రగతిని అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదని.. కొత్త పనులకు ప్రణాళిక లేదని విమర్శించారు.

ఇవి కూడా చదవండి...

ACB: అవినీతిపరుల భరతం పడుతోన్న ఏసీబీ.. పది రోజుల్లోనే

TG News: దత్తత పేరుతో హైడ్రామా... మనవడిని అమ్మేసిన నాయనమ్మ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2024 | 11:26 AM

Advertising
Advertising
<