ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరం

ABN, Publish Date - Jul 23 , 2024 | 01:20 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారన్నారు. సాయన్న వారసురాలిగా కుమారి లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారన్నారు. కానీ ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరమన్నారు.


సాయన్న మృదుస్వభావి.. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారని రేవంత్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలన్నది సాయన్న కోరిక అని.. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరని పేర్కొన్నారు. లాస్య బతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండేవారన్నారు. కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరమని రేవంత్ పేర్కొన్నారు. వారు మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.


వారి ఆశయాలను, వారు చేయాలనుకున్న పనులను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని రేవంత్ అన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నానని తెలిపారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. వారంతా అసెంబ్లీలో వెనుక సీట్లలో కూర్చుండి పోయారు. ఆ ఎమ్మెల్యేల్లో పోచారం, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య ఉన్నారు. ఏ పార్టీ కండువా కప్పుకోకుండా వచ్చి సదరు ఎమ్మెల్యేలు వెనుక వరుసలో కూర్చున్నారు.

ఇవి కూడా చదవండి..

AP Assembly: ఇవాళ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

Madanapalle Fire Accident: మదనపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 01:29 PM

Advertising
Advertising
<