ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maheswar Reddy: ఓటమి భయంతోనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించట్లే

ABN, Publish Date - Jul 06 , 2024 | 01:56 PM

ఓటమి భయంతో సర్పంచ్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి తెలిపారు. లోకల్ బాడీలు లేకపోతే కేంద్రం నుంచి నిధులు రావని తెలిసినా కూడా ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు.

హైదరాబాద్: ఓటమి భయంతో సర్పంచ్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి తెలిపారు. లోకల్ బాడీలు లేకపోతే కేంద్రం నుంచి నిధులు రావని తెలిసినా కూడా ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలల నుంచి జీతాలు రావడం లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె బాట కార్యక్రమానికి వెళ్లాలన్నారు. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతిని నడుపుతోందన్నారు. కాంట్రాక్టర్లు, మంత్రుల కంపెనీలకు ఇవ్వడానికి నిధులు ఉంటాయని.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వడానికి చేతులు రావని మహేశ్వర రెడ్డి విమర్శించారు.


ఎంబీ రికార్డ్ అయిన 12 వందల కోట్ల రూపాయల సర్పంచ్ బిల్లులు ఇంత వరకు రాలేదని.. మిడ్ డే మీల్స్ కార్మికులకు కూడా ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని మహేశ్వరరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో తెలంగాణకు చిన్న నష్టం జరిగినా ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ స్పీకర్ కనబడటం లేదని.. ఆయనకు పంపించిన రిజిస్టర్ పోస్టులు తిరిగి వస్తున్నాయని తెలిపారు. అసెంబ్లీ అడ్రస్ తప్పని.. కావాలనే తిప్పిపంపుతున్నట్లు తెలుస్తోందని మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ తప్పించుకుని తిరిగినా కూడా అసెంబ్లీ సమావేశాల్లో దొరుకుతారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపైన ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

Updated Date - Jul 06 , 2024 | 01:56 PM

Advertising
Advertising
<