Jagadish Reddy: తెలంగాణలో కరువు పరిస్థితులపై సమీక్ష చేయాలి
ABN, Publish Date - Mar 12 , 2024 | 05:11 PM
అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పారు.
సూర్యాపేట: అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ (Congress) పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కేబినెట్ ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. రైతాంగాన్ని గాలికి వదిలేసి.. వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి డబ్బు మూటలు పంపుతున్నారని ఆరోపించారు. తక్షణమే రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి.. ఆయా జిల్లాల్లో మంత్రులు కరువు మీద సమీక్ష చేయాలని సూచించారు. కర్ణాటక సీఎం, ఉపముఖ్యమంత్రితో మాట్లాడి ఆల్మట్టి నుంచి పది టీఎంసీలు నీరు విడుదల చేయించాలని జగదీష్ రెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి
TS Politics: యాదగిరిగుట్టలో కింద కూర్చోవడానికి కారణమిదే: భట్టి విక్రమార్క
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 12 , 2024 | 05:12 PM