ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JNTU: 2 నుంచి సాయంకాలం బీటెక్‌ తరగతులు ప్రారంభం

ABN, Publish Date - Dec 01 , 2024 | 04:10 AM

సాయంకాలం బీటెక్‌లో ప్రవేశాలు పొందిన వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు డిసెంబరు 2 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు.

  • జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సాయంకాలం బీటెక్‌లో ప్రవేశాలు పొందిన వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు డిసెంబరు 2 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు సమాచారమిచ్చినట్టు చెప్పారు. ఈవెనింగ్‌ బీటెక్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఆయన శనివారం విడుదల చేశారు. వర్సిటీలోని మెకానికల్‌, మెటలర్జీ విభాగాల్లో ఈ ఏడాది నుంచి కొత్తగా ఈవెనింగ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 4వరకు మొదటి సెమిస్టర్‌ కొనసాగుతుందని, సెకండ్‌ సెమిస్టర్‌ జూన్‌ 2న ప్రారంభమై అక్టోబరు 18తో ముగుస్తుందన్నారు. సాయంకాలం బీటెక్‌ రెండో సంవత్సరం తరగతులను 2025 నవంబరు 3 నుంచి ప్రారంభిస్తామని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Updated Date - Dec 01 , 2024 | 04:11 AM