ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు నేడు చర్లపల్లి సెంట్రల్ జైలులో జాబ్ మేళా

ABN, Publish Date - Jul 03 , 2024 | 10:48 AM

మారిపోయిన ఖైదీలను జైళ్ల శాఖ అధికారులు అట్టే వదిలేయకుండా వారికి ఉపాధి కల్పన కూడా ఏర్పాటు చేసి బయటకు పంపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లల్లో 231 మందిని క్షమాభిక్ష కోసం జైలు అధికారులు ఎంపిక చేశారు. వారందరికీ జాబ్ మేళా నిర్వహించి తద్వారా ఉపాధి కల్పించాలని నిర్ణయించారు.

హైదరాబాద్: మారిపోయిన ఖైదీలను జైళ్ల శాఖ అధికారులు అట్టే వదిలేయకుండా వారికి ఉపాధి కల్పన కూడా ఏర్పాటు చేసి బయటకు పంపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లల్లో 231 మందిని క్షమాభిక్ష కోసం జైలు అధికారులు ఎంపిక చేశారు. వారందరికీ జాబ్ మేళా నిర్వహించి తద్వారా ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఆసక్తి, అర్హత మేరకు విడుదల కానున్న ఖైదీలకు జైలు అధికారులు ఉపాధి కల్పించనున్నారు.


జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్‌ బంకులతోపాటు డ్రైవర్లు, డేటా ఆపరేటర్లు, ఇతర విభాగాల్లో వారి ఆసక్తి మేరకు ఖైదీలకు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన వారికి అర్హత బట్టి ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాధి కల్పించేందుకు సన్నాహాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఖైదీల విడుదలకు గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. చర్లపల్లి జైలులో జరిగే జాబ్ మేళా కార్యక్రమానికి ఐజి వై రాజేష్, డిఐజి మురళి బాబు, జైల్ శాఖ అధికారులు హాజరు కానున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 10:48 AM

Advertising
Advertising