Hyderabad: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రెచ్చిపోతున్న అకతాయిలు..
ABN, Publish Date - Apr 21 , 2024 | 05:21 PM
హైదరాబాద్‌లో పాష్ ఏరియాలు అంటే.. చటుక్కున గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్. అయితే ఆ యా ప్రాంతాల్లో అకతాయిలు రెచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నామో.. ఎందుకు చేస్తున్నామో అనే సోయ లేకుండా వారు వ్యవహరిస్తున్నారు. దీంతో సదరు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళలకు గురవుతున్నారు.
హైదరాబాద్. ఏప్రిల్ 21: హైదరాబాద్‌లో పాష్ ఏరియాలు అంటే.. చటుక్కున గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్. అయితే ఆ యా ప్రాంతాల్లో అకతాయిలు రెచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నామో.. ఎందుకు చేస్తున్నామో అనే సోయ లేకుండా వారు వ్యవహరిస్తున్నారు. దీంతో సదరు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళలకు గురవుతున్నారు.
Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్
ఇంతకీ ఏం జరిగిందంటే.. మార్చి 20వ తేదీ రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఓ షాపులోని అద్దాలు హఠాత్తుగా పగిలిపోయాయి. అనంతరం గంటల వ్యవధిలోనే ఆ షాపు సమీపంలోని పలు షాపుల్లోని అద్దాలు సైతం పగిలిపోయి.. చిందరవందరగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో సదరు షాపుల్లోని వారంత తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
INDIA bloc leaders: రాంచీలో ర్యాలీ
ఈ ఘటనలో షాపులోని ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఆ మరునాడు రోడ్డు నెంబర్ 2లోని ఓ ప్రముఖ దర్శకుడి సినిమా ప్లస్ షాపింగ్ మాల్‌లోని అద్దాలు సైతం ఇదే విధంగా పగిలిపోయాయి. ఆ తర్వాత ఇటువంటి ఘటనలే .. సదరు సినిమా ప్లస్ షాపింగ్ మాల్‌లో వరుసగా రెండు సార్లు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.
Bihar: కు.ని ఆపరేషన్ చేసిన కాంపౌండర్: చనిపోయిన మహిళ
ఆ తర్వాత అదే రోడ్డుని పలు షాపుల అద్దాలు సైతం ఇదే తరహాలో పగిలిపోయాయి. దీంతో సదరు షాపుల యజమానులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో ఇప్పటి వరకు 8 కేసులు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులోభాగంగా ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం వారు పరిశీలిస్తున్నారు.
Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు
ఆ క్రమంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారిని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో సైతం ఇదే తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని.. ఆ ప్రాంతంలోని పలు షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు సైతం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.
తెలంగాణ వార్తలు కోసం..
Updated Date - Apr 21 , 2024 | 05:21 PM