KCR: కేసీఆర్‌కు మరో చాన్స్ ఇద్దామా!
ABN, Publish Date - Jul 02 , 2024 | 04:50 AM
ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్తు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ల నిర్మాణంలో వచ్చిన ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి లేఖ రాసే అంశాన్ని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ పరిశీలిస్తోంది. ఆరోపణలు చేసిన విద్యుత్తు రంగ నిపుణులు, ఇతర ఫిర్యాదుదారులను ప్రశ్నించే (క్రాస్ ఎగ్జామిన్) అవకాశం కేసీఆర్‌కు ఇవ్వాలా? లేక వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలా? అనే దానిపై కమిషన్ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది.
లేఖ రాసే యోచనలో జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్
విద్యుత్తు రఘు, కోదండరామ్‌ను క్రాస్ ఎగ్జామిన్
చేయడానికి కేసీఆర్‌కు అవకాశంపై పరిశీలన
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్తు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ల నిర్మాణంలో వచ్చిన ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి లేఖ రాసే అంశాన్ని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ పరిశీలిస్తోంది. ఆరోపణలు చేసిన విద్యుత్తు రంగ నిపుణులు, ఇతర ఫిర్యాదుదారులను ప్రశ్నించే (క్రాస్ ఎగ్జామిన్) అవకాశం కేసీఆర్‌కు ఇవ్వాలా? లేక వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలా? అనే దానిపై కమిషన్ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది.
పోటీ బిడ్డింగ్ లేకుండా ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోవడం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లను నామినేషన్ పద్ధతిలో నిర్మించే బాధ్యతను కట్టబెట్టడంపై కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాలకు కేసీఆరే కారకుడంటూ విద్యుత్తు నిపుణులు కంచర్ల రఘు, ఎం.తిమ్మారెడ్డి, ఎం.వేణుగోపాల్‌రావు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్.. నర్సింహారెడ్డి కమిషన్‌కు నివేదించారు.
ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్‌కు అవకాశం ఇస్తూ కేసీఆర్‌కు లేఖ రాసింది. ఈ లేఖపై వారం రోజుల్లో స్పందించాలని కోరింది. కానీ, కేసీఆర్ మాత్రం కమిషన్ ఏర్పాటునే సవాలు చేశారు. కమిషన్‌ను రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అయితే కేసీఆర్ పిటిషన్‌ను కోర్డు కొట్టివేసింది. కమిషన్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. దీంతో సాక్షులను ప్రశ్నించేందుకు వీలుగా కేసీఆర్‌కు మరో అవకాశం ఇవ్వాలా? లేకవారి ఫిర్యాదులను సాక్ష్యాలుగా పరిగణించాలా? అని కమిషన్ యోచిస్తోంది. సహజ న్యాయసూత్రాల ప్రకారం ఎవరైనా సాక్షులు ఆరోపణలు చేస్తే.. వారిని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం న్యాయస్థానం/కమిషన్ ఇస్తుంది.
Updated Date - Jul 02 , 2024 | 04:50 AM