ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medigadda Barrage: బ్యారేజీలను కాపాడుకోండి!

ABN, Publish Date - May 10 , 2024 | 05:45 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ సూచించారు.

  • వెంటనే మరమ్మతులు చేపట్టండి

  • ఎన్‌డీఎ్‌సఏ నివేదికను అమలు చేయండి

  • అధికారులకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ సూచన

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ సూచించారు. బ్యారేజీల పునరుద్ధరణపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) మధ్యంతర నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని అధికారులకు స్పష్టం చేశారు. గురువారమిక్కడి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్‌ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 7న ఆయన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.


అప్పటికే ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక ఇవ్వడంతో దాంతో పాటు బ్యారేజీల పరిస్థితులపై జస్టిస్‌ ఘోష్‌ అధికారులతో చర్చించారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బ్యారేజీల మరమ్మతులు/పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలం ముంచుకొస్తున్నందున తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని పేర్కొన్నారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదికను ప్రామాణికంగా చేసుకొని బ్యారేజీల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే నివేదిక అమలుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీని వేస్తున్నామని అధికారులు జస్టిస్‌ ఘోష్‌కు వివరించారు.


ఈఎన్‌సీ జనరల్‌ నేతృత్వంలో కమిటీ

ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ నివేదిక అమలు కోసం ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ నేతృత్వంలో కమిటీ వేశారు. కమిటీలో ఈఎన్‌సీ బి.నాగేంద్రరావు, సీడీవో చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌కుమార్‌ ఉండగా సభ్య కన్వీనర్‌గా రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డిని నియమించారు. ఈ నెలాఖరులోనే బ్యారేజీలకు వరద వచ్చే అవకాశం ఉన్నందున కమిటీ చర్యలకు ఉపక్రమించనుంది.


కాళేశ్వరంపై రెండే ఫిర్యాదులు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణపరమైన, నాణ్యత, నిర్వహణ లోపాలు తదితర కారణాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు గురువారం దాకా రెండే ఫిర్యాదులు అందాయి. ఈ నెల 31లోగా బ్యారేజీల్లో నిర్మాణ నాణ్యత, నిర్వహణ లోపాలతో పాటు నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేయాలని కమిషన్‌ గత నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చింది.


ఫిర్యాదుదారులు కచ్చితంగా తగిన సాక్ష్యాధారాలు పొందుపర్చి.. నోటరీ సంతకంతో ప్రమాణపత్రం(అఫిడవిట్‌) ఆధారంగా ఫిర్యాదు చేయాలని కమిషన్‌ షరతులు పెట్టడం వల్లే ఆధారాలు లేనివారు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న పార్లమెంట్‌ ఎన్నికలు ఉండడంతో పోలింగ్‌ అనంతరం ఫిర్యాదులు పెరిగే

Updated Date - May 10 , 2024 | 05:45 AM

Advertising
Advertising