Delhi Liquor Scam: జులై 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు
ABN, Publish Date - Jun 21 , 2024 | 01:42 PM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 21: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ముందు ఆమెను వర్చువల్‌గా సీబీఐ అధికారులు హాజరుపరిచారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆమె జ్యుడిషియల్ కస్టడీలోభాగంగా న్యూఢిల్లీలోని తీహాడ్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఇదే కేసులో ఆమెను సీబీఐ సైతం విచారించింది. ఆ క్రమంలో ఆమె నుంచి కీలక విషయాలను సీబీఐ రాబట్టింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jun 21 , 2024 | 05:07 PM