ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

K. Lakshman: అబద్ధపు హామీలతో కాంగ్రెస్‌ మోసం చేసింది

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:12 AM

కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారాలు, అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.

  • ప్రజా క్షేత్రంలో ఎండగడతాం

  • ఏడాది గడిచినా హామీల అమలేది?: ఎంపీ కె.లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారాలు, అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. మీడియాతో కె.లక్ష్మణ్‌ శుక్రవారం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బీజేపీ అధ్వర్యంలో నిర్వహించే సభకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ కుర్చీ దగ్గర డబ్బులు దొరికాయని, చైర్మన్‌ చెప్పినా కూడా ఆ పార్టీ రాజకీయం చేస్తుందని విమర్శించారు.


ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంటే చూసి ఓర్వ లేని విదేశీ దుష్టశక్తులు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని పట్టుకుని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. భారత్‌లో తయారయిన కోవాక్సిన్‌కు వ్యతిరేకంగా ‘‘ఆర్గనైజ్డ్‌ క్రైం అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు(ఓసీసీఆర్‌పీ)’’ తప్పుడు కథనాలు ఇస్తే, వాటిని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారని అన్నారు. దేశానికి వ్యతిరేక వార్తలు వచ్చిన ప్రతిసారి రాహుల్‌ గాంధీ వాటిని అందుకుని నానా హంగామా చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు.

Updated Date - Dec 07 , 2024 | 04:12 AM