Telangana Media Academy: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్ రెడ్డి
ABN, Publish Date - Feb 25 , 2024 | 02:37 PM
మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన పదవీలో కొనసాగుతారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంత రావు ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్: మీడియా అకాడమీ చైర్మన్‌గా (Media Academy Chairman ) కే శ్రీనివాస్ రెడ్డిని (Srinivas Reddy) తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన పదవీలో కొనసాగుతారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంత రావు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. మీడియా అకాడమీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ హోదా పొందుతారు. గతంలో విశాలాంధ్ర పత్రికకు కే శ్రీనివాస్ రెడ్డి సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజా పక్షం పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2024 | 02:37 PM