ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శాంతి, ప్రేమతో ప్రశాంత జీవనం

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:31 AM

క్రీస్తు బోధనలైన శాంతి, ప్రేమ మార్గాలను మానవాళి పాటి స్తూ ప్రశాంతంగా జీవనం సాగించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించా రు.

మంథనిలో కేక్‌ తినిపిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు

- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

- ఘనంగా క్రిస్‌మస్‌ వేడుకలు

మంథని, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): క్రీస్తు బోధనలైన శాంతి, ప్రేమ మార్గాలను మానవాళి పాటి స్తూ ప్రశాంతంగా జీవనం సాగించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించా రు. బుధవారం మంథనిలోని బేతేలు గాసెంల్‌, సీయో ను చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏసుప్రభువు దీవెనలతో, కైస్త్రవుల సహకారంతో తాను ప్రజాసంక్షే మం, మంథ ని ప్రాంత అభివృద్ధితో ముందుకు సాగుతున్నానన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తోందని, క్రైస్తవుల ప్రార్థన స్థలాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించా రు. సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామన్నా రు. చర్చిల అభివృద్ధి కోసం నిధులు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం క్రిస్మస్‌ వేడుకల లో భాగంగా మంత్రి కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండ్రు రమ-సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు శశిభూషణ్‌ కాచే, ఐలి ప్రసాద్‌, ఐఎంఏ జనరల్‌ సెక్రెటరీ అంకరి కుమార్‌, పాస్టర్లు, సంఘం పెద్దలు, మహిళలు, క్రిస్టియన్లు పాల్గొన్నారు.

క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం

సుల్తానాబాద్‌: యేసు క్రీస్తు బోధనలు విశ్వమాన వాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణం లోని పలు ప్రాంతాల్లో గల చర్చిల్లో క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు శాంతి, సహనం, కరుణ ప్రతీ ఒక్కరూ కలిగి ఉండాల ని బోధించిన ఏసుక్రిస్తు మాటలు అందరూ అనుసరిం చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌ రావు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, పాస్టర్స్‌ పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌/మార్కండేయకాలనీ: క్రిస్మస్‌ సంబ రాలు గోదావరిఖనిలో అంబరాన్నాంటాయి. తెల్లవారు జాము నుంచే అన్ని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు. గాంధీనగర్‌ సెయింట్‌పాల్‌ చర్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే గౌతమినగర్‌లోని గ్లోరియస్‌ చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ క్రిస్మస్‌ అని అన్నారు. రామగుండం ప్రజలను యేసు ప్రభువు చల్లాగా చూడాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్‌కట్‌ చేసి మిఠాయులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉదయ్‌రాజ్‌, వడ్డేపల్లి దాస్‌, దయానంద్‌గాంధీ, తిప్పార పు శ్రీనివాస్‌, పెండ్యాల మహేష్‌, దాసరి విజయ్‌, అల్లి శంకర్‌ పాల్గొన్నారు. జీఎం కాలనీలోని ఎప్తా చర్చిలో పాస్టర్‌ తిమోతి పాల్‌, విఠల్‌నగర్‌లోని బీడీఎస్‌ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకలకు పాస్టర్‌ డిలైట్‌రెడ్డి కేక్‌కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. వేడుకల్లో జీవన్‌రెడ్డి, అభిజిత్‌, దీపక్‌, భీష్మ, ఎస్పిబా, శ్రీనివాస్‌, జాన్‌, సుమన్‌ పాల్గొన్నారు.

ప్రేమతో అన్ని జయించవచ్చు

ధర్మారం: శత్రువును సైతం ప్రేమతో జయించవచ్చ ని, అందుకు నిదర్శనం యేసు క్రీస్తేనని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ధర్మారం, పత్తిపాక చర్చిల్లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలతో కలసి కేక్‌ కట్‌ చేసిన అడ్లూరి, అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అడ్లూరి మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రేమ, శాంతితో లోకాన్ని జయించాడని ఆయన మార్గాన్ని అనుసరిస్తే శత్రువును సైతం ప్రేమతో జయించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మహిళకు చీరలు, చిన్నపిల్లలకు బహుమతులను అందజేశారు. క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా అడ్లూరి మండలంలోని 25 చర్చీలకు కేకులు పంపిణీ చేశారు. వేడుకల్లో పాస్టర్‌ నెల్సన్‌, ఏఎంసీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌ తదితరలు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:31 AM