ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాఫీగా ‘ఇందిరమ్మ’ సర్వే

ABN, Publish Date - Dec 25 , 2024 | 01:28 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే రాజన్నసిరిసిల్ల జిల్లాలో సాఫీగా సాగుతోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం ఈ నెల 8 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్‌ వార్డు అధికారులు సేకరించిన వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు.

సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే రాజన్నసిరిసిల్ల జిల్లాలో సాఫీగా సాగుతోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం ఈ నెల 8 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్‌ వార్డు అధికారులు సేకరించిన వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. పేదల సొంతింటి కలసాకారం చేసే దిశగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఈ నెల 31లోగా పూర్తి చేయనున్నారు. మరో ఐదురోజులే గడువు ఉండడంతో సర్వేను మరింత ముమ్మరం చేశారు.

- గ్రామసభల్లో అర్హుల ఎంపిక..

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకోసం ప్రజాపాలనలో 1,07,398 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అర్హతను బట్టి ఇళ్ల మంజూరు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రాధాన్య క్రమంలో కేటాయింపులు జరిగే విధంగా సర్వే చేస్తున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాసుల్లో ఇప్పటివరకు 59,822 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. 55.70 శాతం సర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన వెంటనే మరోసారి పరిశీలన జరిపి గ్రామ సభల్లో అర్హులను ఎంపిక చేయనున్నారు.

- నాలుగు విడతల్లో రూ. 5 లక్షలు...

జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో ఏగె వేల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇంటి నిర్మాణానికి నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు అర్థిక సహాయం అందించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో తొలి ప్రాధాన్యంగా నిరుపేదలు, దళితులు, గిరిజనులు వ్యవసాయ కూలీలు, పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల్లో దివ్యాంగులకు ఐదు శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ మైనార్టీలకు 50 శాతం, జనరల్‌ కేటగిరీ కింద 15 శాతం చొప్పున ఇళ్లను కేటాయించనున్నారు. ఇంటి నిర్మాణంలో పునాది స్థాయిలో రూ లక్ష, రెండో దశలో రూ 1.25 లక్షలు, మూడో దశలో స్లాబ్‌కు రూ. 1.75 లక్షలు, ఫినిషింగ్‌, ఇతర దశలకు రూ. లక్ష చొప్పున అందించనున్నారు.

Updated Date - Dec 25 , 2024 | 01:28 AM