చురుకుగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
ABN, Publish Date - Dec 20 , 2024 | 01:15 AM
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు అం దించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసు కుని చేపట్టిన సర్వే జిల్లాలో జోరుగా సాగుతోంది.
జగిత్యాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు అం దించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసు కుని చేపట్టిన సర్వే జిల్లాలో జోరుగా సాగుతోంది. రాష్ట్రం లోనే ఇందిరమ్మ ఇంటి సర్వేలో జగిత్యాల జిల్లా ముందు వరసలో ఉంటోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇంటి సర్వేలో జగిత్యాల జిల్లా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉంటుందని గృహ నిర్మాణ శాఖ వర్గాలు అంటున్నాయి. జిల్లా వ్యా ప్తంగా అందిన దరఖాస్తులను పరిశీలించి యాప్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో 380 మంది పం చాయతీ సెక్రటరీలు, మున్సిపాలిటీల్లో సుమారు 110 మంది వార్డు ఆఫీసర్లు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతీ 500 దరఖాస్తులకు ఒక సర్వే అధికారి నియమించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి రాజేశ్వర్ ఎప్పటికప్పుడు పలు ప్రాంతాల్లో పర్యవేక్షణ జరి పి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తుండడంతో సర్వే వేగవంతంగా జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈనెల 9వ తేదీన ప్రారంభించిన సర్వే ఇ ప్పటివరకు 25.3 శాతం పూర్తయింది. ఈనెల 31 వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. తొలి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. నియోజకవర్గా నికి 3,500 చొప్పున జిల్లా వ్యాప్తంగా జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్‌లతో పాటు చొప్పదండి సెగ్మెంట్‌లోని కొడిమ్యాల, మల్యాల మండలాలు, వేము లవాడ సెగ్మెంట్ పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి, బీమా రం మండలాల్లో సుమారు 14 వేల ఇళ్ల నిర్మాణానికి ఆ ర్థిక సాయం అందించాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల సంఖ్య..
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటి కోసం 2,02,011 ద రఖాస్తులు వచ్చాయి. ఇందులో జగిత్యాల మున్సిపల్‌లో 15,195, మెట్‌పల్లి మున్సిపల్‌లో 9,832, కోరుట్ల మున్సి పల్‌లో 12,594, ధర్మపురి మున్సిపల్‌లో 3,596, రాయికల్ మున్సిపల్‌లో 2,942 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా జగిత్యాల అర్బన్ మండలంలో 2,286, పెగడపల్లిలో 9,777, బీర్‌పూర్‌లో 5,398, మేడిపల్లిలో 9,416, కథలా పూర్‌లో 9,367, కోరుట్లలో 6,830, కొడిమ్యాలలో 8,452, మల్యాలలో 9,480, రాయికల్‌లో 11,150, మెట్‌పల్లిలో 8, 924, గొల్లపల్లిలో 11,640, ధర్మపురిలో 10,419, జగిత్యాల రూరల్ మండలంలో 11,091, ఇబ్రహీంపట్నంలో 7,941, సారంగపూర్‌లో 6.076, మల్లాపూర్‌లో 11,649, బుగ్గారం లో 5,118, వెల్గటూరులో 12,838 దరఖాస్తులు వచ్చాయి.
ఇప్పటికే 25.03 శాతం సర్వే పూర్తి..
జిల్లాలో ఈనెల 18వ తేదీ వరకు 25.03 శాతం ఇందిరమ్మ ఇంటి సర్వేను అధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 50,558 దరఖాస్తుల సర్వే నిర్వ హించారు. మరో 5,674 దరఖాస్తుల సర్వేను పాక్షికంగా పూర్తి చేశారు. జిల్లాలో అత్యధికంగా ధర్మపురి మున్సిపాలిటీల్లో 51.33 శాతం, కోరుట్ల మున్సిపాలిటీలో 48.43 శాతం సర్వే నిర్వహించారు. అత్యల్పంగా వెల్గటూరులో 14.27 శాతం, బు గ్గారంలో 14.73 శాతం సర్వే పూర్తయింది. మల్లాపూర్‌లో 16.14 శాతం, సారం గపూర్‌లో 16.56 శాతం, ఇబ్రహీంపట్నంలో 17.26 శాతం, జగిత్యాలలో అర్బన్ మండలంలో 17.28 శాతం, ధర్మపురిలో 18.31 శాతం, గొల్లపల్లిలో 18.60 శాతం, మెట్‌పల్లిలో 19.55 శాతం, రాయికల్‌లో 21.10 శాతం, మల్యాలలో 21.06 శా తం, కొడిమ్యాలో 22.76 శాతం, కోరుట్లలో 23.47 శాతం, కథలాపూర్‌లో 23.80 శాతం, మేడిపల్లిలో 24.71 శాతం, బీర్‌పూర్‌లో 24.94 శాతం, జగిత్యాల ము న్సిపల్‌లో 30.16 శాతం, పెగడపల్లిలో 32.63 శాతం, మెట్‌పల్లి మున్సిపల్‌లో 41.06 శాతం, రాయికల్‌లో 46.13 శాతం, జగిత్యాల రూరల్ మండలంలో 46.85 శాతం సర్వేను పూర్తి చేశారు.
అవసరమైన పత్రాలు ఇస్తే పది నిమిషాల్లో ప్రక్రియ పూర్తి
దరఖాస్తుదారుడు అందుబాటులో ఉండి అవసరమైన పత్రాలు అందిస్తే ప ది నిమిషాల్లో ప్రక్రియను పూర్తి చేయవచ్చని, పలు గ్రామాల్లో సిగ్నల్స్ సమస్య తో ఆలస్యమ వుతుందని సర్వేయర్లు చెబుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందారా అనే విషయం సర్వే తెలిసిపోతుం దంటున్నారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది, గదులు, కుటుంబ సభ్యుల వివరాలు తదితర వాటిని సేకరిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన స్థలం ఉందా..? ఉంటే వాటికి సంబంధించిన దృవపత్రాలు, లేక పోతే ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు, సాదా బైనా మా పత్రం స్కానింగ్ చేస్తున్నారు. దరఖాస్తుదారుడి ఫొ టోతో పాటు ఇంటి స్వరూ పానికి సంబంధించిన మూడు ఫొటోలు తీస్తున్నారు. తల్లిదండ్రులతో పాటు కు మారులు పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో వేర్వేరుగా నివాసముంటున్న వారు ముందే దరఖాస్తు చేసుకొని ఉంటే వారికి అదే స్థలంలో వేర్వేరుగా సర్వే చేస్తున్నారు.
ఈనెల చివరి వరకు పూర్తి చేస్తాం
రాజేశ్వర్, గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి,
జిల్లాలో ఇందిరమ్మ ఇంటి సర్వేను ఈనెల చివరి వరకు పూర్తి చేస్తాము. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య ఎ దురవుతోంది. అయినప్పటికి ఎప్పటికప్పుడు సమస్యలను అధి గమిస్తూ సర్వేను పూర్తి చేస్తున్నాము. కలెక్టర్ సత్యప్రసాద్ ప లు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇంటి సర్వే పనులను వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష్యం మేరకు సర్వే పూర్తి చేస్తాము.
Updated Date - Dec 20 , 2024 | 01:15 AM