Revanth Reddy: వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
ABN, Publish Date - Nov 20 , 2024 | 07:10 AM
రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ (Vemulawada) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. కాగా రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 127 కోట్లు మంజూరు చేసింది.
రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తుతో పాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని, బహిరంగ సభలో మాట్లాడతారు. సీఎం పర్యటన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల మళ్లింపు చేపట్టారు. భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్మహాజన్లతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి ఉదయం హెలికాప్టర్లో వేములవాడకు చేరుకోని ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ఇప్పటికే మంజూరైన రూ 127.65 కోట్లకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ. 76 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేస్తారు. రూ 47.85 కోట్లతో మూలవాగు బ్రిడ్జి నుంచి రోడ్ల వెడల్పునకు సంబం ధించిన పనులు మూల వాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ వరకు మురికి కాలువల నిర్మాణ పనులకు శంకు స్థాపనలు చేస్తారు. రూ. 50 కోట్లతో యారన్ డిపోను ప్రారంభిస్తారు. దీంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 17 గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున రూ. 85 లక్షల ప్రొసీడింగ్‌లను అందజేస్తారు. రూ. 235 కోట్లతో మిడ్ మానేరు నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు రూ. 166 కోట్లతో చేపట్టే మెడికల్ కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణాలకు, రూ. 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం పనులు, రూ. 52 కోట్లతో కోనరావుపేట మండలంలో చేపట్టే హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సిరిసిల్లలో రూ 26 కోట్లతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ 1.45 కోట్లతో నిర్మించిన గ్రంథాల భవనం, రూ 4.80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్నా రు. 631 శివశక్తి మహిళ సంఘాలకు రూ 102 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను పంపిణీ చేస్తారు. దేవస్థానం గుడిచెరువు మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.
భారీ బందోబస్తు...
ముఖ్యమంత్రి వేములవాడ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 1,100 మంది పోలీసులు పటిష్ట బందోబస్తులో పాల్గొననున్నారు. బందోబస్తుకు సంబంధించి సెక్టార్లుగా విభజించి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను బాధ్యులుగా నియమించారు. బందోబస్తులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఏడు చోట్ల ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా...
ఉదయం 9.50 గంటలకు వేములవాడ దేవస్థానానికి చేరుకుంటారు.
9.55 నిముషాలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.
10 గంటల నుంచి 10.15 వరకు గెస్ట్‌హౌజ్‌లో ఉంటారు.
10.15 నుంచి 11 గంటల వరకు స్వామివారిని దర్శనం, ప్రత్యేక పూజలో పాల్గొంటారు.
11.15 నిముషాలకు ధర్మగుండం అభివృద్ధి పనులకు శంకుస్థాపన
11.30 గంటలకు తిరిగి గెస్ట్‌హౌజ్‌కు చేరకుంటారు.
11.40 బహిరంగ సభ
12.30 నిముషాలకు గెస్ట్‌హౌజ్‌లో భోజనం
మధ్యాహ్నం 1 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 20 , 2024 | 07:10 AM