ఎల్లంపల్లి భూముల కబ్జాపై కలెక్టర్ సీరియస్
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:42 AM
ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు భూములను కబ్జా చేసి అక్రమంగా 200 ఎకరాల్లో చేపల చెరువు ఏర్పాటుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష సీరియస్ అయ్యారు. ’ఎల్లంపల్లి భూములు కబ్జా’ అనే శీర్షికన మూడు రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు.
ఫ పరిశీలన కోసం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు
ఫ ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
గోదావరిఖని, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు భూములను కబ్జా చేసి అక్రమంగా 200 ఎకరాల్లో చేపల చెరువు ఏర్పాటుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష సీరియస్ అయ్యారు. ’ఎల్లంపల్లి భూములు కబ్జా’ అనే శీర్షికన మూడు రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. ఈ విషయంలో పరిశీలన జరిపి తగు చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించాలని శ్రీపాద ఎల్లంపల్లి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, నీటిపారుదల అధికారులు అక్రమంగా ఎల్లంపల్లి భూముల్లో నిర్మించిన చేపల చెరువులను కూల్చివేయాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే కోట్ల రూపాయలు గడిస్తున్న భూముల కబ్జా ఆక్రమణదారుల మాఫియా ఇటు ఇరిగేషన్ అధికారులపై, జిల్లా యంత్రాంగంపై ప్రభుత్వంలోని పెద్దలతో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అంతర్గాం మండలం పొట్యాల నుంచి ముర్మూర్ వరకు సోమనపల్లి, ఆకెనపల్లి, ముర్మూర్ శివారుల్లో శ్రీపాద ప్రాజెక్టు భూముల్లో ఈ దందా కొనసాగిస్తుండడంతో ఆ ప్రాంతలోని అన్నివర్గాలపై సంబంధాలు కలిగి ఉన్న ఈ మాఫియా తమ కబ్జాలను కొనసాగించే విధంగా పైరవీలకు తెరలేపినట్టు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం కూడా శ్రీపాద ప్రాజెక్టు భూముల దురాక్రమణను నిరోధించేందుకు చర్యలకు పూనుకున్నది.
Updated Date - Dec 24 , 2024 | 12:42 AM