పూర్తిస్థాయి రుణ మాఫీ చేసి తీరుతాం
ABN, Publish Date - Dec 25 , 2024 | 12:51 AM
సైదాపూర్, డిసెంబరు 24: ప్రతి పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేసీ తీరుతామని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సైదాపూర్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సైదాపూర్, డిసెంబరు 24: ప్రతి పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేసీ తీరుతామని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సైదాపూర్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జనవరిలో రైతులకు రైతు భరోసా అందుతుందన్నారు. ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా యాసంగి సాగు కోసం నీటి విడుదలకు ప్రణాళికలు రూపొందించామన్నారు. రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ జరిగిందని, మార్చి వరకు రెండు లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేస్తామన్నారు. రైతులు రెండు లక్షలపైన ఉన్న డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందన్నారు. అయిదు సంవత్సరాల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేయని వారు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, గుండారపు శ్రీనివాస్, అధ్యక్షుడు మిట్టపెళ్లి కిష్టయ్య, మునిగంటి సంతోష్, బొమ్మగాని రాజు, యాదగిరి, రాజు, నవీన్ పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 12:51 AM