ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏసీపీ కార్యాలయంలో సీపీ తనిఖీలు

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:33 AM

వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తనిఖీ చేశారు.

కోల్‌సిటీ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించడంతో పాటు ఏసీపీ ఆధ్వర్యంలో జరిగిన కేసుల దర్యాప్తు పురోగతి, గ్రేవ్‌ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు తీరును ఏసీపీని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ లో ఉన్న అట్రాసిటీ కేసులు, సంబంధించిన రికా ర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే సహించేది లేదని, నేరాల కట్టడికి సమిష్టిగా, సమన్వయంతో పని చేయాలన్నారు. చట్టాన్ని అతిక్రమించే చర్యలకు పాల్పడే వారిని వదలవద్దన్నారు. తమ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, ముందస్తు సమాచార సేకరణ అవసరమన్నారు. ఈ తనిఖీల్లో డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, టుటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌రావు, మంథని సీఐ రాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 01:33 AM