ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏఐటీయూసీపై విమర్శలు మానుకోవాలి

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:37 AM

సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిస్తే తోటి కార్మిక సంఘాలు ఓర్వడం లేదని, ఇది ట్రేడ్‌ యూనియన్‌ విధానానికి మంచి పద్ధతి కాదని, ఏఐటీయూసీపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూని యన్‌(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ అన్నారు.

గోదావరిఖని, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిస్తే తోటి కార్మిక సంఘాలు ఓర్వడం లేదని, ఇది ట్రేడ్‌ యూనియన్‌ విధానానికి మంచి పద్ధతి కాదని, ఏఐటీయూసీపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూని యన్‌(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన ఏఐటీయూసీ ఆర్‌జీ-1 బ్రాంచి జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో గత పది సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్‌ ఉంటె కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, స్ట్రక్చర్‌ సమావేశాలు జరుగడం లేదని ఏఐటీయూసీ పలు మార్లు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని గత ప్రభుత్వాన్ని కోరినా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఎన్నికలు పెట్టాలని ఏఐటీయూసీ హైకోర్టుకు వెళ్లడంతో సింగరేణిలో డిసెంబరు 27న జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం గా గెలిస్తే తోటి కార్మిక సంఘాలు ఓర్వడం లేదన్నారు. పైగా పస లేని విమర్శలు చేస్తూ కార్మికుల మనసుల్లో ఏఐటీయూసీపై విషబీజాలు నాటుతూ వారిని అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏఐటీయూసీ ఎదుర్కొంటుందన్నారు. అసలు సింగరేణిలో ఎన్నికలు అవసరం లేదని యాజమాన్యంతో ములాఖతై కార్మికులకు ద్రోహం చేసిన సంఘాలు ఏఐటీయూసీపై ఆరోపణలు, విమర్శలు చేసే నైతిక అర్హత లేదని పేర్కొన్నారు. ఏఐటీయూసీ ఎన్నికల్లో గెలిచిన తరువాత పది నెలలకు గుర్తింపు పత్రం తీసుకున్న వెంటనే నవంబరులో కార్మికుల ముఖ్యమైన సమస్యలను స్ట్రక్చర్‌ సమావేశంలో మాట్లాడడం జరిగిందన్నారు. కొన్నింటిపై అవగాహన కుదిరిందని, మిగతా వాటిని సీఎండీ స్థాయి సమావేశంలో మాట్లాడుతామన్నారు. కార్మికుల మొత్తం సమస్యలు ఒకేసారి కావని, ఒక పద్ధతి ప్రకారంగా యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని తెలిపారు. సింగరేణికి రావలసిన రూ.33వేల కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభు త్వం వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. సింగరేణిలో పాతబడిన మిషన్‌లతో బొగ్గు ఉత్పత్తి చేయడం వల్ల ప్రమాదాలు జ రుగుతున్నాయని, కొత్త మిషన్‌ల కోసం బడ్జెట్‌ అవసరం ఉందన్నా రు. యూనియన్‌ మెంబర్‌ షిప్‌కు కార్మిక వర్గం సహకరించి ఏఐటీ యూసీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ ఆర్‌జీ-1బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్‌, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకులు గౌతం గోవర్ధన్‌, రంగు శ్రీను, ఎస్‌ వెంకట్‌ రెడ్డి, బోగ సతీష్‌ బాబు, గండి ప్రసాద్‌, పెర్క మహేందర్‌, మిట్ట శంకర్‌, కే శ్రీనివాసరావు, ఎండీ సోహేల్‌, చెప్యాల భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 01:37 AM