ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి అంతంత మాత్రమే

ABN, Publish Date - Dec 28 , 2024 | 02:00 AM

చేసిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలను ఇవ్వక పోవడం, నిధులను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో అభివృద్ధి పనులు ముందకు కదలడం లేదు. జిల్లాలో ఏడాది కాలంగా ఒక అడుగు ముందుకు రెండడుగుల వెనక్కి అన్నచందంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి.

- అరకొర నిధులతో అవస్థలు

- పెండింగ్‌లో బిల్లులు

- ముందుకు కదలని పనులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

చేసిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలను ఇవ్వక పోవడం, నిధులను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో అభివృద్ధి పనులు ముందకు కదలడం లేదు. జిల్లాలో ఏడాది కాలంగా ఒక అడుగు ముందుకు రెండడుగుల వెనక్కి అన్నచందంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం, 15వ ఆర్థిక సంఘం నిధులతో అక్కడక్కడ అంతర్గత రోడ్లు, మంచినీటి పైపులైన్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ఓపెన్‌ జిమ్స్‌, కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణాల వంటి చిన్నచిన్న పనులు జరుగుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే, గ్రామపంచాయతీ నిధులతో గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కోట్లలోనే బకాయి ఉండగా ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్నాయి.

ఫ నగరంలో అసంపూర్తి పనులు

గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సీఎం హామీ పనులు, పట్టణ ప్రగతి నిధులు, స్మార్ట్‌సిటీ, ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు జరిగాయియి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హామీ, పట్టణ ప్రగతి నిధులను విడుదల పూర్తిగా నిలిపివేసింది. పట్టణ ప్రగతికి సంబంధించి 12 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. వాటిని కూడా విడుదల చేయలేదు. దీంతో గతంలో పనులు ప్రారంభించిన పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసిన పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. నగరంలో దాదాపు 50కిపైగా రోడ్లు, నాలుగు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు, కళాభవన్‌ వంటి పనులను అసంపూర్తిగానే వదిలివేశారు. ఇటీవల సీఎం ప్రత్యేక నిధుల నుంచి 32 కోట్లను మంజూరు చేసినట్లు బడ్జెట్‌ రిలీజింగ్‌ ఆర్డర్‌ను జారీ చేసిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ నిధులను విడుదల చేయలేదు. గతంలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తమ వాటాగా ఇచ్చిన 100 కోట్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం 100క ోట్లను విడుదల చేసినా అవి పెండింగ్‌ పనుల బిల్లుల చెల్లింపులకే సరిపోయాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు 3 కోట్లు, అమృత్‌-2 147 కోట్లనిధులతో మంచినీటి పైపులైన్ల పనులు, కమ్యూనిటీ హాల్స్‌ వంటి పనులు చేపడుతున్నారు.

ఫ అంధకారంలో తీగల వంతెన

మానేరుపై నిర్మించిన తీగల వంతెన నిర్వహణలోపంతో అంధకారంలో మునిగిపోయింది. మిగిలిన పనులను, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా వదిలివేశారు. నిధులలేమి కారణంగా మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు చేతెలెత్తేయడంతో వెలుగులతో విరాజిల్లిన తీగలవంతెన ఇప్పుడు చీకట్లో మగ్గుతూ ప్రమాదాలకు నిలయంగా మారింది. 410 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మొదటి దశలో 74 శాతం పనులు పూర్తికాగా అంచనా వ్యయం 470 కోట్లకు చేరింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 234 కోట్లను విడుదల చేసినప్పటికి ఇంకా పనులు ప్రారంభం కాలేదు. కార్పొరేషన్‌లో పరిధిలోని అల్గునూర్‌లో 40 కోట్లతో అంగన్‌వాడీ, పీహెచ్‌సీ, రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టారు.

ఫ ‘శాతవాహన’కు ఇంజనీరింగ్‌, లా కళాశాలలు

శాతవాహన యూనివర్సిటీకి కొత్తగా ఒక ఇంజనీరింగ్‌, లా కళాశాలను మంజూరు చేయడంతోపాటు ఫార్మసీ వసతి గృహ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు 40 లక్షలతో జిల్లా గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. మరో ఆరు కోట్లతో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతిపాదనలను పంపించారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణాలకు టెండర్‌ ప్రక్రియ నిర్వహించినా కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రాక పోవడంతో ఆ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దుర్శేడ్‌-గుంటూరు పల్లె బీటీ రోడ్డు భూమి పూజచేసి వదిలిపెట్టారేగాని పనులు జరుగడం లేదు. దుర్శేడ్‌ పాత వంతెన పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కోటి 80 లక్షలు మంజూరు చేయగా కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు.

ఫ మండలాల్లో జరుగుతున్న పనులు

గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణ పనులు చేపడుతున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి మండలంలో గుమ్లాపూర్‌లో 120 కోట్లతో నీటిని తరలించే పనులను ప్రారంభించారు. చిట్యాలపల్లి నుండి గుమ్లాపూర్‌ వరకు 4 కోట్లతో బీటీ రోడ్‌, సుడా నిధులు 1.2 కోట్ల కాట్నపల్లి కొక్కరకుంట రోడ్డు పనులు, ఉపాధిహామీ నిధులు 30 లక్షలతో చాకుంట, భూపాలపట్నం రోడ్డుకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేదు. 60 లక్షల రూపాయల ఉపాధిహామీ నిధులతో సీసీ రోడ్లు వేశారు.

- గంగాధర మండలంలో 57.61 కోట్లను వివిధ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉపాధిహామీ తో 3 కోట్లతో రోడ్లు, పాఠశాల కంపౌండ్‌ పనులను పూర్తి చేశారు. కాసారం నుంచి గర్శకుర్తి 2.46 కోట్లతో పనులు చేపడుతున్నారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేట నుంచి గంగాధర మండలం బూర్గుపల్లి వరకు ఎనిమిది కోట్లతో రోడ్డు పనులు చేపడుతున్నారు.

- రామడుగు మండలంలో రెండు కోట్ల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు పనులు పూర్తి చేశారు. మరో కోటి రూపాయల నిధులను గ్రామీణ లింక్‌ రోడ్లకు మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదు. సుడా నిధులతో కోటి 20 లక్షలతో కొక్కెరకుంట, కాట్నపల్లి రోడ్‌కు నిధులు విడుదల చేసినా పనులు జరుగడం లేదు.

- తిమ్మాపూర్‌లో ఉపాధి హామీ నిధులు కోటి 80 లక్షలతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టారు. కోటి 40 లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులు మంజూరీ కాగా 60 లక్షల పనులు పూర్తికాగా, మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయి. సీఆర్‌ఆర్‌ నిధులు 3 కోట్లతో కొత్తపల్లిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోటి రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాజీవ్‌రహదారి నుంచి తిమ్మాపూర్‌ గ్రామానికి రెండు కోట్లతో రోడ్డు వేయాల్సి ఉండగా టెండర్‌ ప్రక్రియ పూర్తికాలేదు. యాదవులపల్లిలో తెలంగాణ యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాలలకు 225 కోట్లు మంజూరు చేశారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

- మానకొండూర్‌ మండలంలోని అనంతగిరి గ్రామ సమీపంలో వంతెన నిర్మాణానికి కోటి 50 లక్షల నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించలేదు. మరో 50 లక్షలను అంతర్గత రోడ్లకు మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదు.

- శంకరపట్నం మండలంలో కోటి 20 లక్షలతో సీసీ రోడ్లు పూర్తికాగా, ఎస్‌డీఎఫ్‌ నిధులు కోటి 40 లక్షలతో రోడ్డు పనులు చేపడుతున్నారు. 90 లక్షల ఉపాధి హామీ నిధులతో అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలను నిర్మించాల్సి పనులు ప్రారంభం కాలేదు. 40 లక్షలతో వేయాల్సిన సీసీ రోడ్లు పనులు ప్రారంభించలేదు.

- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్‌ రోడ్డుకు 72 కోట్లు మంజూరయ్యాయి. పనులు చేపడుతున్నారు. మండల కేంద్రంలో పీహెచ్‌సీ నిర్మాణానికి కోటి 40 లక్షలు మంజూరు కాగా పనులు ప్రారంభించలేదు. గన్నేరువరం నుంచి బేగంపేట వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు 32 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 80 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు 52.2 కోట్లను మంజూరు చేయగా పనులు జరుగుతున్నాయి.

- హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్‌ మండలంలోని దమ్మక్క పేటలో 20 లక్షలతో మంచిపైపులైను నిర్మాణ పనులు చేపడుతున్నారు. పట్టణంలోని పలు రోడ్లకు 55 లక్షలను మంజూరు చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఆదర్శ పాఠశాలకు 30 లక్షల నిధులు మంజూరు చేశారు.

- వీణవంక మండలంలో ఎస్‌డీఎఫ్‌ నిధులు 78 లక్షలతో సీసీ రోడ్లు, మురికికాలువలు, ప్రహరీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. రెండు గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ నిధులు 60 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

- సైదాపూర్‌ మండలంలో 36 కోట్లతో సీసీ రోడ్లు, అమ్మ ఆదర్శ పాఠశాల భవనం, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, వ్యవసాయ గోదాం, వాటర్‌ ప్లాంట్లు, బ్రిడ్జి నిర్మాణ, అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నారు.

- జమ్మికుంట మండలంలో ఏడాదిలో 2.59 కోట్ల నిధులు మంజూరు కాగా 95 లక్షలతో సీసీ రో డ్లు పనులు చేపడుతున్నారు. వావిలాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది. 36 లక్షలతో ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్నా పనులు మాత్రం ఆశించిన రీతిలో జరుగడం లేదు.

Updated Date - Dec 28 , 2024 | 02:00 AM