ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన వద్దు..

ABN, Publish Date - Dec 29 , 2024 | 12:49 AM

ఇందిర మ్మ ఇల్లు రాలేదని పేదలు ఆందోళన చెందవద్దని, ప్రతి నిరుపేదకు విడతల వారీగా మంజూరుచేస్తామని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు.

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఇందిర మ్మ ఇల్లు రాలేదని పేదలు ఆందోళన చెందవద్దని, ప్రతి నిరుపేదకు విడతల వారీగా మంజూరుచేస్తామని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి మండలంలోని చందపల్లి, హనుమంతునిపేట (రాంపల్లి) శివారుల్లో నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లలో మౌలిక వసతుల కల్పన పనులను శనివారం మున్సిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అసం పూర్తిగా డబుల్‌ బెడ్‌రూమ్‌ల నిర్మాణాలు వదిలేశారన్నా రు. ఇప్పటికే 4కోట్ల రూపాయలు కేటాయించి డైన్రేజీలు, రోడ్లు, నీటిసంపులు, ఇతరత్రా మౌలిక వసతుల ఏర్పాటు కు చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగే స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం 5లక్షల రూపాయ లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సర్వే ఇప్పటికే పూర్తి కావోస్తోందని, నిరు పేదలకు మొదటి దశలో ఇళ్ల కేటా యింపు జరుగుతుందని వివరిం చారు. ఏడాదికి నియోజకవర్గానికి 3వేల 500 చొప్పున ఇళ్లు ఇవ్వను న్నట్లు తెలిపారు. దశలవారీగా అర్హులైన అందరికీ ఇళ్లు కేటాయి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌, ఎ.ఈ, విద్యుత్‌ అధికారులు, ఏఎం సీ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డబుల్‌ బెడ్‌ ఇళ్ల లబ్ధిదా రులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:49 AM