ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: అయ్యో పాపం.. ఇంట్లో దీపం ఎంతపని చేసింది!

ABN, Publish Date - Feb 20 , 2024 | 12:52 PM

Telangana: ఇంట్లో దీపం పెట్టి వెల్లడమే వారి పాలిట శాపంగా మారింది. ఇంట్లో దీపం వెలగించి మేడారం జాతరకు వెళ్లిన వారికి విషాదమే మిగిలింది. వారి నివాసాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

కరీంనగర్, ఫిబ్రవరి 20: ఇంట్లో దీపం పెట్టి వెల్లడమే వారి పాలిట శాపంగా మారింది. ఇంట్లో దీపం వెలగించి మేడారం జాతరకు వెళ్లిన వారికి విషాదమే మిగిలింది. వారి నివాసాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని ఆదర్శనగర్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో సిలిండర్లు పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టుపక్కల ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

మొత్తం 10 సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితులు మేడారం జాతరకు వెళ్లినట్లు తెలుస్తోంది. జాతరకు వెళ్లే ముందు బాధితులు ఇంట్లో దీపం వెలిగించి వెళ్లారు. దీపం గుడిసెకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఒకదానితో మరొకటి అంటుకోవడంతో గుడిసెలు దగ్ధమయ్యాయి. మంటల్లో డబ్బు, నగలు మొత్తం కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితుల వేదన వర్ణణాతీతం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 20 , 2024 | 12:52 PM

Advertising
Advertising